కనకాగార
1-311-మ.
కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ ముందటం
గని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నే కాలంబు దుర్లంఘ్యమై
యనివార్యస్థితిఁ జంపునట్టి నిరుపాయంబైన కాలంబు వ
చ్చె నుపాంతంబున; మాఱు దీనికి మదిం జింతింపు ధాత్రీశ్వరా!
ఓరాజా! ప్రపంచంలోని మానవులు బంగారు భవనాలు,
పుత్ర, మిత్ర, కళత్ర పరివారాన్ని ఎల్లప్పుడు
ఎదురుగుండ చూచుకొంటు, ప్రాణాలమీద తీపిని పెంచుకొంటు ఉంటారు.
అయితే దుర్నివారక మైన కాలం వాళ్లను చంపి తీరుతుంది. కాలాన్ని కాదని ఎదిరించే శక్తి
ఎవరికీ లేదు. అక్కడ ఏ ఉపాయాలు పనిచేయవు. నీకు అలాంటి కాలం దగ్గరపడింది. మహారాజ! దీనికి ప్రతిక్రియ ఏదైన ఆలోచించండి.
కురుక్షేత్ర
యుద్దానంతరం ధర్మరాజు పంచను చేరి రోజులు వెళ్ళదీస్తున్న ధృతరాష్ట్ర్రునికి
విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తు ఇలా చెప్పసాగాడు.
1-311-ma.
kanakaagaara
kaLatra mitra suta saMghaataMbulan muMdaTaM
gani
praaNaechChala nuMDu jaMtuvula nae kaalaMbu durlaMghyamai
yanivaaryasthiti@M
jaMpunaTTi nirupaayaMbaina kaalaMbu va
chche
nupaaMtaMbuna; maaRu deeniki madiM jiMtiMpu dhaatreeSvaraa!
కనక = బంగారము;
అగార = గృహములు; కళత్ర = భార్యలు; మిత్ర = మిత్రులు; సుత = సంతానముల; సంఘాతంబు లన్ = సమూహములను; ముందటన్ = ఎదురు గుండా; కని = చూసి; ప్రాణ = ప్రాణములమీద; ఇచ్ఛలన్ = మక్కువతో; ఉండు = ఉండు; జంతువులను = జీవులను; ఈ = ఈ; కాలంబు = కాలము; దుర్లంఘ్యము = దాటరానిది; ఐ = అయ్యి; అనివార్య = నివారింపరలేని; స్థితిన్ = విధముగ; చంపున్ = చంపును; అట్టి = అటువంటి; నిరుపాయంబు = ఉపాయములేనిది; ఐన = అయినట్టి; కాలంబు = కాలము; వచ్చెన్ = వచ్చెను; ఉపాంతంబున = సమీపమునకు; మాఱు = తిరుగు; దీని = దీని; కిన్ = కి; మదిన్ = మనసులో; చింతింపు = ఆలోచించుము; ధాత్రీశ్వరా = రాజా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
2 comments:
విజయవంతంగా 300 పద్యాలు పూర్తి చేసినందుకు అభినందనలు రావుగారు.మీ కలం ఇలానే కలకాలం సాగాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను.
ధన్యవాదాలు చి. సౌ. +sridevi gajula మీ అభిమానానికి, తెలుగుభాగవతంపై ఆదరానికి. మా నల్లనయ్య మీకు సకల సౌభాగ్యాలు సుఖ సంతోషాలతో తులతూగే నిండు నూరేళ్ళ జీవితం అనుగ్రహించు గాక.
Post a Comment