Monday, May 5, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 279

సతి దన పతి

4-59-క.

తి దన పతి యగు నా పశు
తిఁ జూచి సముత్సుకతను భాషించె; ప్రజా
తి మీ మామ మఖము సు
వ్రమతి నొనరించుచున్న వాఁడఁట వింటే.
          అప్పుడు సతీదేవి అతిశయించిన కుతూహలంతో తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరునితో ఇలా అంటోంది మీ మావగారు దక్షప్రజాపతి దీక్షాపరుడై యజ్ఞం చేస్తున్నా డట. మీరు విన్నారు కదా స్వామి!”
దక్షాధ్వర ధ్వంసం ఘట్టంలో, దక్షుడు తలపెట్టిన నిరీశ్వరయాగానికి తరలి వెళ్తున్న దేవతలను గమనించిన సతీదేవి భర్తను, వెళ్ధామని అడుగబోతో ఇదిగో ఇలా అంటోంది.
4-59-ka.
sati dana pati yagu naa paSu
pati@M joochi samutsukatanu bhaashiMche; prajaa
pati mee maama makhamu su
vratamati nonariMchuchunna vaa@MDa@MTa viMTae;
          సతి = సతీదేవి; తన = తన యొక్క; పతి = భర్త; అగు = అయిన; = ; పశుపతిన్ = శివుని {పశుపతి - పాశములచే బంధించబడిన సకల జీవులను పాలించు అధిపతి, శివుడు}; చూచి = చూసి; సముత్సకతను = మంచి; ఉత్సుకతనున్ = ఉత్సాహముతో; భాషించెన్ = మాట్లాడెను; ప్రజాపతి = ప్రజాపతి; మీ = మీ యొక్క; మామ = మావగారు; మఖమున్ = యాగమును; సువ్రత = బాగుగా చేయు; మతిన్ = ఉద్దేశ్యముతో; ఒనరించుచున్ = చేస్తూ; ఉన్నవాడట = ఉన్నాడట; వింటే = విన్నారా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: