శంభుకంట
10.1-805-ఆ.
శంభుకంట నొకటి జలరాశి నొక్కటి
మఱియు నొకటి మనుజ మందిరముల
నొదిగెఁ గాక మెఱసి యున్న మూడగ్నులు
చలికి యులికి భక్తి సలుప కున్నె?
చలిదెబ్బకు తట్టకోలేక త్రేతాగ్నులు మూడు
అగ్నులలోను ఆహవనీయం అనే అగ్ని ఒకటి శివుని మూడోవ నేత్రంలో అణగి ఉంది. దక్షిణాగ్ని
అనే మరొకటి సాగర గర్భంలో చొచ్చింది. గార్హపత్యం అనే అగ్ని ఇంకొకటి గృహస్తుల
ఇండ్లలో ఒదిగి ఉంది. అలాకాక బట్టబయల ఉంటే హేమంతఋతు చలికి త్రేతాగ్నులు కొకంర్లు తిరిగి
పోయేవి.
చక్కటి ఈ హేమతఋతువర్ణన ఆటవెలదిలోని కవిచమత్కారం ఎంతో
అందంగా ఉంది.
10.1-805-aa.
SaMbhukaMTa
nokaTi jalaraaSi nokkaTi
maRiyu nokaTi
manuja maMdiramula
nodige@M
gaaka meRasi yunna mooDagnulu
chaliki
yuliki bhakti salupa kunne?
శంభు = శివుని; కంటన్ = కంటి యందు; ఒకటి = ఒకటి; జలరాశిన్ = సముద్రము నందు; ఒక్కటి = ఒకటి; మఱియున్ = ఇంకను; ఒకటి = ఒకటి; మనుజ = మానవుల; మందిరములన్ = నివాసము లందు; ఒదిగెన్ = దాగెను; కాకన్ = లేకపోయినచో; మెఱసి = బహిరంగముగా మెలగుచు; ఉన్నన్ = ఉండినచో; మూడగ్నులు = త్రేతాగ్నులు మూడు {త్రేతాగ్నులు - 1గార్హపత్యము 2ఆహవనీయము 3దక్షిణాగ్నులు
అనెడి మూడు అగ్నులు}; చలి = చలి; కిన్ = కి; ఉలికి = అదిరి బెదిరి; భక్తి = సేవ; సలుపకన్ = చేయకుండగా; ఉన్నె = ఉండునా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment