తనువుమనువు
9-121-ఆ.
తనువు మనువు విడిచి, తనయులఁ జుట్టాల
నాలి విడిచి, సంపదాలి విడిచి,
నన్నకాని యన్య మెన్నఁడు
నెఱుఁగని
వారి విడువ నెట్టివారి నైన.
తమ దేహాన్ని, జీవితాన్ని, భార్యాబిడ్డలను, బాంధువులను,
సంపదలను సర్వం వదలి నన్నే నమ్ముకున్న వారిని, నన్ను తప్పించి ఇతర మెరుగని వారిని,
ఎలాంటివారైనా సరే నేను ఎన్నడు వదిలిపెట్టను.
అంబరీషుని మీద కృత్యను
ప్రయోగించాడు దూర్వాసుడు. సుదర్శన చక్రం కృత్యను హతమార్చి, దూర్వాసుని వెంటబడింది.
పోయి ప్రార్థించగా భక్తపరాధీనుడు విష్ణువు ఇలా చెప్తూ “పోయి అబరీషుని శరణువేడు,
అతను కాపాడతాడు” అని చెప్పి పంపాడు.
9-121-aa.
tanuvu
manuvu viDichi, tanayula@M juTTaala
naali
viDichi, saMpadaali viDichi,
nannakaani
yanya menna@MDu neRu@Mgani
vaari
viDuva neTTivaari naina.
తనువున్ = దేహమును; మనువున్ = జీవితాన్ని; విడిచి = వదలి; తనయులన్ = పిల్లలను; చుట్టాలన్ = బంధువులను; ఆలిన్ = భార్యను; విడిచి = వదలివేసి; సంపద = సంపదలు; అలి = అన్నిటిని; విడిచి = వదిలేసి; నన్న = నన్ను మాత్రము; తప్పించి = తప్పించి; అన్యము = ఇతరము; ఎన్నడున్ = ఎప్పుడు; ఎఱుగని = తెలియని; వారిన్ = వారిని; విడువన్ = వదలిపెట్టను; ఎట్టి = ఎలాంటి; వారిన్ = వారు; ఐనన్ = అయి నప్పటికిని.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
2 comments:
తప్పు చేసిన చోటే క్షమాపణను వేడుకోవడమన్నది విజ్ఞత కలవారి లక్షణం , చాలా బాగుంది రావుగారు.మానవ రూపంలోని రాక్షసులు మనిషిగా మారడానికి ఇటువంటి పద్యం రోజుకొక్కటి చదివి మననం చేసుకుంటే చాలేమో అనిపిస్తుంది .
Blogger sridevi gajula
అవునండి శ్రీదేవిగారు. బాగుపడటం అంటే అదేకదా. అందుకే భాగవతం చదువుకుదాం, బాగుపడదాం మనం అందరం.
Post a Comment