Tuesday, May 27, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 299

కంఠేకాలునిచేతం

9-615-క. 
కంఠేకాలునిచేతం
గుంఠితుఁడగు టెట్లు మరుఁడు? కుసుమాస్త్రంబుల్
లుంఠించి గుణనినాదము
ఠంమ్మన బాల నేసె వఠవ గదురన్.
          అదిగో మన్మథుడు ఆ పిల్ల మీద అల్లెతాడు ఠంఠమ్మనేలా పూలబాణాలు సంధించి ఠవఠవ మని నాటేలా వేసాడు. కంఠంనల్లగా ఉన్న శంకరుడు మరులురేపే మన్మథుని దహించాడు అంటే ఎలా నమ్మేది.
దుష్యంతుని ప్రధమదర్శనంలో శకుంతల స్థితి వర్ణన యిది.
9-615-ka.
kaMThaekaalunichaetaM
guMThitu@MDagu TeTlu maru@MDu? kusumaastraMbul
luMThiMchi guNaninaadamu
ThaMThammana baala naese ThavaThava gaduran.
          కంఠేకాలుని = పరమశివుని {కంఠేకాలుడు - కంఠము నల్లగానున్నవాడు, శంకరుడు}; చేతన్ = వలన; కుంఠితుడు = దహింపబడిన వాడు; అగుట = ఐ ఉండుట; ఎట్లు = ఎలా అగును, కాదు; మరుడున్ = మన్మథుడు; కుసుమ = పూల; అస్త్రంబుల్ = బాణములను; లుంఠించి = సంధించి; గుణ = అల్లెతాడు; నినాదము = ధ్వని; ఠంఠమ్ము = ఠంకారము; అనన్ = చేయగా; బాలన్ = బాలికపైన; ఏసెన్ = ప్రయోగించెను; ఠవఠవ = టకటకమని; కదురన్ = పడేలాగ .
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: