తరణంబులు
11-15-క.
తరణంబులు భవజలధికి
హరణంబులు దురితలతల కాగమముల కా
భరణంబు లార్తజనులకు
శరణంబులు, నీదు
దివ్యచరణంబు లిలన్.
ఓ శ్రీకృష్ణా! భూలోకంలో నీ
దివ్యమైన శ్రీచరణాలు సంసారసాగరాన్ని దాటించే తెప్పల వంటివి. పాపాలనే పాశాలను
హరించునవి. ఆగమాలకు ఆభరణాలైనవి. ఆర్తు లైన వారికి శరణు వొసంగెడివి.
విశ్వామిత్ర, వసిష్ఠ, నారదాది మహర్శులు వచ్చి దర్శించి ద్వారకానగరంలో
దివ్యంగా కొలువున్న వాసుదేవుని ప్రార్తిస్తున్నారు.
11-15-ka.
taraNaMbulu
bhavajaladhiki
haraNaMbulu
duritalatala kaagamamula kaa
bharaNaMbu
laartajanulaku
SaraNaMbulu,
needu divyacharaNaMbu leelan.
తరణంబులు = దాటించెడి తెప్పలు; భవ = సంసార; జలధి = సముద్రమున; కిన్ = కు; హరణంబులు = హరించెడివి; దురిత = పాపాలు అనెడి; లతలు = తీవెల; కిన్ = కు; ఆగమములు = వేదాల; కిన్ = కు; ఆభరణంబులు = అలంకారములు; ఆర్త = ఆర్తులైన; జనులు = వారి; కున్ = కు; శరణంబులు = రక్షించునవి; నీదు = నీ యొక్క; దివ్య = దివ్యమైన; చరణంబు = పాదములు; ఇలన్ = భోలోకములో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment