Wednesday, May 7, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 280


ఉద్రేకంబున రారు

1-163-శా.
ద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
ద్రాకారులఁ బిన్నపాఁపల రణప్రౌఢ క్రియాహీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా నీ చేతు లెట్లాడెనో?
          ఉద్రేకంతో నీ పైకి దూకలేదే; యుద్ధరంగంలో ఆయుధపాణులై ఎదురు నిలువలేదే; లవలేశం కూడా నీకు అపకారం చేయలేదే; అటువంటి చిన్నవాళ్లను, అందాలు చిందే పిన్నవాళ్లను, యుద్ధవిద్యలు ఇంకా సరిగా నేర్వని వాళ్లను, నిద్రలో ఆదమరచి ఉన్న వాళ్లను కారుచీకటిలో, వీరావేశంతో వధించటానికి అయ్యో! నీకు చేతు లెలా వచ్చాయయ్యా?
అశ్వత్థామను కట్టి పట్టుకొచ్చి కృష్ణార్జునులు ద్రౌపది ముందు పడేసారు. ఆమె ఇంత చిన్న పిల్లలను దయమాలి ఎలా హతమార్చావు అంటు ఇలా ప్రశ్నిస్తోంది.
1-163-Saa.
udraekaMbuna raaru Sastradharulai yuddhaavanin laeru kiM
chiddrOhaMbunu neeku@M jaeyaru balOtsaekaMbutO@M jee@MkaTin
bhadraakaarula@M binnapaa@Mpala raNaprauDha kriyaaheenulan
nidraasaktula saMhariMpa nakaTaa nee chaetu leTlaaDenO?
ఉద్రేకంబున = ఉద్రేకముతో; రారు = రారు; శస్త్ర = శస్త్రములు; ధరులు = ధరించిన వారు; = అయ్యి; యుద్ధ = రణ; అవనిన్ = భూమిలో; లేరు = లేరు; కించిత్ = కొంచెము కూడ; ద్రోహంబును = ద్రోహమును; నీకున్ = నీకు; చేయరు = చేయరు; బల = బలమువలని; ఉత్సేకంబు = ఉద్రేకము; తోన్ = తో; చీకటిన్ = చీకట్లో; భద్ర = బంగారం లాంటి; ఆకారులన్ = రూపమున్న వారిని; పిన్న = చిన్న; పాఁపల = పిల్లలను; రణ = యుద్ధము; ప్రౌఢ = నేర్పుగా; క్రియా = చేయట; హీనులన్ = రాని వారిని; నిద్ర = నిద్రపోవు; ఆసక్తులన్ = ఆసక్తి నున్నవారిని; సంహరింపన్ = సంహరించుటకు; అకటా = అయ్యో; నీ = నీ యొక్క; చేతులు = చేతులు; ఎట్లు = ఎలా; ఆడెనో = వచ్చెనో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: