కుప్పించిఎగసిన
1-223-సీ.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి;
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న;
జగముల వ్రేఁగున జగతి గదలఁ;
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ;
బైనున్న పచ్చనిపటము జాఱ;
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక;
మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;
తే.
గరికి లంఘించు
సింహంబుకరణి మెఱసి
నేఁడు భీష్మునిఁ
జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున యనుచు
మద్విశిఖ
వృష్టిఁ
దెరలి చనుదెంచు
దేవుండు దిక్కు నాకు.
ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని
భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు
కట్టినట్లే కన్పిస్తున్నది. కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం
నిండా వ్యాపించాయి. ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక
భూమండలం కంపించిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న
బంగారుచేలం జారిపోయింది. “నమ్ముకొన్న
నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ ”ద్దని మాటి మాటికి కిరీటి
వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే ఆ గోపాల దేవుడే నాకు
రక్ష.
అంపశయ్యమీద నున్న భీష్మాచార్యులు కృష్ణుని స్తుతిస్తున్నారు.
1-223-see.
kuppiMchi
yegasina@M guMDalaMbula kaaMti;
gaganabhaagaM
bella@M gappikona@Mga;
nuRikina
nOrvaka yudaraMbulO nunna;
jagamula
vrae@Mguna jagati gadala@M;
jakraMbu@M
jaepaTTi chanudeMchu rayamuna@M;
bainunna
pachchanipaTamu jaaRa;
nammiti
naalaavu nagu@MbaaTu saeyaka;
manniMpu
mani kreeDi marala@M diguva@M;
tae.
gariki
laMghiMchu siMhaMbukaraNi meRasi
nae@MDu
bheeshmuni@M jaMpudu ninnu@M gaatu
viDuvu
marjuna yanuchu madviSikha vRshTi@M
derali
chanudeMchu daevuMDu dikku naaku.
కుప్పించి = దుమికి; యెగసినన్ = పరుగెడుతుండగ; కుండలంబుల = (చెవి) కుండలముల
యొక్క; కాంతిన్ = కాంతి; గగన = ఆకాశ; భాగంబు = భాగము; ఎల్లన్ = సమస్తము; కప్పికొనఁగన్ = నిండిపోగా; ఉఱికిన = దుముకిన;
ఓర్వక = ఓర్చుకొనలేక; ఉదరంబు = పొట్ట; లోన్ = లోపల; ఉన్న = ఉన్నట్టి; జగముల = జగత్తుల; వ్రేఁగున = వడి వలన; జగతి = భూమి; కదలన్ = కదలగా; చక్రంబున్ = చక్రమును; చేన్ = చేత; పట్టి = పట్టి; చనుదెంచు = వచ్చుచున్న; రయమునన్ = వేగమువలన; పైన = పైన; ఉన్న = ఉన్నట్టి; పచ్చని = పచ్చని; పటము = బట్ట; జాఱన్ = జారగ; నమ్మితిన్ = నమ్ముకొంటిన; నా = నాయొక్క; లావున్ = పరువును; నగుఁబాటు = నవ్వులపాలు; సేయకన్ = చేయకుము; మన్నింపుము = మన్నించుము; అని = అని; క్రీడి = అర్జునుడు; మరలన్ = వెనుకకు; దిగువన్ = లాగుచుండగా; కరి = ఏనుగు; కి = కొరకు; లంఘించు = దూకు; సింహంబు = సింహము; కరణి = వలె; మెఱసి = ప్రకాశించుచు; నేఁడు = ఈవేళ; భీష్మునిన్ = భీష్ముని; చంపుదున్ = సంహరించెదను; నిన్నున్ = నిన్ను; కాతు = కాపాడుదును; విడువుము = వదులు; అర్జున = అర్జునా; అనుచున్ = అనుచూ; మత్ = నాయొక్క; విశిఖ = బాణముల; వృష్టిన్ = వానను; తెరలి = తప్పించుకొని; చనుదెంచు = వచ్చు; దేవుండు = దేవుడు; దిక్కు = శరణమగుగాక; నాకు = నాకు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment