కమలనాభునెఱిగి
8-613-ఆ.
కమలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు
నెఱిఁగి శుక్రు మాట లెఱిగి నాశ
మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి
మహి వదాన్యుఁ
డొరుఁడు మఱియుఁ గలఁడె.
బలిచక్రవర్తి విష్ణుమూర్తిని
తెలుసుకున్నాడు. దేశకాలాలు తెలుసుకున్నాడు. శుక్రుని మాటలు అర్థం చేసుకున్నాడు.
తనకు చేటువాటిల్లుతుందని తెలుసుకున్నాడు. అయినప్పటికి యోగ్యమైనదిగా భావించి ఆ దాన
మిచ్చాడు. లోకంలో అటువంటి మహాదాత మరొకడుంటాడా?
8-613-aa.
kamalanaabhu
neRi@Mgi kaalaMbu daeSaMbu
neRi@Mgi
Sukru maaTa leRigi naaSa
meRi@Mgi
paatra manuchu nichche daanamu bali
mahi
vadaanyu@M Doru@MDu maRiyu@M gala@MDe.
కమలనాభున్ = విష్ణుడని; ఎఱిగి = తెలిసి; కాలంబు = కాల ప్రభావము; దేశంబు = ప్రదేశ ప్రభావములను; ఎఱిగి = తెలిసి; శుక్రు = శుక్రుని; మాటలు = మాటలను; ఎఱిగి = తెలిసి; నాశమున్ = కలిగెడి చేటు; ఎఱిగి = తెలిసి; పాత్రము = యోగ్యమైనది; అనుచున్ = అనుచు; ఇచ్చెన్ = ఇచ్చెను; దానమున్ = దానమును; బలి = బలి; మహిన్ = భూమి మీద; వదాన్యుడు = దాత; ఒరుడు = ఇంకొకడు; మఱియున్ = మఱి; కలడె = ఉండగలడా, లేడు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment