ఈశ్వరుండు
1-213-ఆ.
ఈశ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని
కేమిసేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు
నతనిమాయలకు మహాత్ములు విద్వాంసు
లడఁగి మెలగుచుందు రంధు లగుచు.
పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు
ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు. ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద
విద్వాంసులు సైతం దిక్కు తెలియనివారై, లోబడి అణిగి మణిగి ఉంటారు.
అంపశయ్యపై నున్న కురువృద్ధుడు భీష్ములవారు తనని చూడటానికి
వచ్చిన ధర్మరాజాదులతో మాట్లాడుతు కృష్ణభగవానుని మహాత్యం చెప్తున్నారు.
1-213-aa.
eeSvaruMDu
vishNu@M DevvaeLa nevvani
kaemisaeyu@M
burushu@M Daemi yeRu@Mgu
natanimaayalaku
mahaatmulu vidvaaMsu
laDa@Mgi
melaguchuMdu raMdhu laguchu.
ఈశ్వరుండు = నారాయణుడు {ఈశ్వరుడు - ఈశత్వము (ప్రభుత్వము) కలవాడు};
విష్ణుఁడు = నారాయణుడు; ఎవ్వేళ = ఏ సమయమునకు; ఎవ్వని = ఎవని; కిన్ = కి; ఏమి = ఏమి; సేయున్ = చేయునో; పురుషుఁడు = మానవుడు; ఏమి = ఏమి; యెఱుఁగున్ = తెలియగలడు; అతని = అతని యొక్క; మాయలు = మహిమలు; కు = కి; మహాత్ములు = గొప్పవారు; విద్వాంసులు = పండితులు; అడఁగి = లొంగి; మెలగుచూ = చరిస్తూ; ఉందురు = ఉంటారు; అంధులు = గ్రుడ్డివారు; అగుచున్ = అవుతూ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment