పాంచాలీకబరీవికర్షణ
1-177-శా.
పాంచాలీ కబరీవికర్షణమహాపాప క్షతాయుష్కులం
జంచద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి
ప్పించెన్ రాజ్యము ధర్మపుత్త్రునకుఁ గల్పించెన్
మహాఖ్యాతిఁ జే
యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్రప్రభావంబునన్.
నిండుసభలో ద్రుపదరాజనందన
జుట్టు పట్టుకు లాగిన మహాపాప ఫలితంగా దుర్మదాంధులైన
ధృతరాష్ట్రనందనుల ఆయుష్షులు క్షీణించాయి. వారలందరినీ
నందనందనుడైన గోవిందుడు కరుక్షేత్రయుద్ధంలో చంపించి, ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు. విజయభేరి మ్రోయించి మహేంద్రవైభవంతో మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు.
ధర్మరాజుకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెప్పించాడు.
ప్రాస అక్షరంగా పూర్ణానుస్వరం ముందున్న చకారం
ప్రయోగింపబడింది. నిండుసభలో చేసిన అకృత్యం వదలిపెట్టదు కదా మరి.
1-177-Saa.
paaMchaalee
kabareevikarshaNamahaapaapa kshataayushkulaM
jaMchadgarvula
dhaartaraashTrula naniM jaMpiMchi gOviMdu@M Di
ppiMchen
raajyamu dharmaputtrunaku@M galpiMchen mahaakhyaati@M jae
yiMchen
moo@MDu turaMgamaedhamulu daevaeMdraprabhaavaMbunan.
పాంచాలీ = ద్రౌపది యొక్క; కబరీ = జుట్టును; వికర్షణ = పట్టుకొని తోసివేసిన; మహా = ఘోరమైన; పాప = పాపము వలన; క్షత = క్షీణించిన; ఆయుష్కులన్ = ఆయుస్సు గల వారిని; చంచత్ = చెలరేగిన; గర్వులన్ = గర్వముతో నున్న వారిని; ధార్తరాష్ట్రులన్ = ధృతరాష్ట్ర పుత్రులను; అనిన్ = యుద్ధమున; చంపించి = చంపించి; గోవిందుఁడు = కృష్ణుడు; ఇప్పించెన్ = ఇప్పించెను; రాజ్యమున్ = రాజ్యమును; ధర్మపుత్రుడు = యుధిష్ఠురున {ధర్మపుత్రుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; కున్ = కి; కల్పించెన్ = కలిగించెను; మహా = గొప్ప; ఖ్యాతిన్ = కీర్తిని; చేయించెన్ = చేయించెను; మూఁడు = మూడు; తురంగమేధములు = అశ్వమేధయజ్ఞములు; దేవేంద్ర = దేవేంద్రుని; ప్రభావంబునన్ = వైభవముతో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment