Thursday, April 21, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – శ్రీమహిళా

7-359-ఉ.
శ్రీహిళా, మహేశ, సరసీరుహగర్భుల కైన నీ మహో
ద్దాకరంబుచే నభయదానము జేయవు; నేను బాలుఁడం
దాస వంశ సంభవుఁడ దైత్యుఁడ నుగ్ర రజోగుణుండ ని
స్సీ దయం గరాంబుజము శీర్షముఁజేర్చుట చోద్య మీశ్వరా!
టీకా:
          శ్రీమహిళా = లక్ష్మీదేవి {శ్రీమహిళ - శ్రీ (సంపదలకు) మహిళ (తల్లి), లక్ష్మి}; మహేశ = పరమశివుడు {మహేశుడు - మహా (గొప్ప) ఈశుడు, శివుడు}; సరసీరుహగర్భుల = బ్రహ్మల {సరసీరుహగర్భుడు - సరసీరుహ (పద్మమున) గర్భుడు (కలిగినవాడు), బ్రహ్మ}; కైనన్ = కి అయినను; నీ = నీ యొక్క; మహా = గొప్ప; ఉద్దామ = స్వతంత్రమైన; కరంబు = చేయి; చేన్ = చేత; అభయ = అభయమును; దానము = ఇచ్చుట; చేయవు = చేయవు; నేను = నేను; బాలుడన్ = చిన్నపిల్లవాడను; తామస = తమోగుణసంగతమైన; వంశ = కులమున; సంభవుడన్ = పుట్టినవాడను; దైత్యుడను = రాక్షసుడను; ఉగ్ర = భయంకరమైన; రజోగుణుండన్ = రజోగుణముగలవాడను; నిస్సీమ = హద్దులేని; దయన్ = కరుణతో; కర = చేయి యనెడి; అంబుజమున్ = పద్మమును; శీర్షమునన్ = తలపైన; చేర్చుట = పెట్టుట; చోద్యము = అద్భుతము; ఈశ్వరా = నరసింహా {ఈశ్వరుడు - ప్రభువు, విష్ణువు}.
భావము:
            ప్రభూ! లక్ష్మీ పతి! నరసింహా! పద్మంలో పుట్టిన ఆ బ్రహ్మదేవుడికి అయినా సరే నీ చెయ్యెత్తి తలమీద పెట్టి అభయం ఇవ్వలేదు. నేనేమో చిన్న పిల్లాడిని; తామసగుణంతో కూడిన రాక్షసవంశంలో పుట్టిన వాడిని; దైత్యుడిని; ఉగ్ర మైన రజోగుణం కలవాడను; అలాంటి నా తల మీద, అవ్యాజ్యమైన కృపతో నీ దివ్య భవ్య హస్తాన్ని ఉంచి దీవించావు. ఇది నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది.
७-३५९-उ.
श्रीमहिळा, महेश, सरसीरुहगर्भुल कैन नी महो
द्दामकरंबुचे नभयदानमु जेयवु; नेनु बालुँडं
दामस वंश संभवुँड दैत्युँड नुग्र रजोगुणुंड नि
स्सीम दयं गरांबुजमु शीर्षमुँजेर्चुट चोद्य मीश्वरा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: