Tuesday, July 23, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥ -- 64- 65- 66

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]

2.100.64.అనుష్టుప్.

కచ్చిత్తే బ్రాహ్మణాశ్శర్మ

సర్వశాస్త్రార్థకోవిదాః।

ఆశంసంతే మహాప్రాజ్ఞ!

పౌరజానపదైస్సహ॥

తాత్పర్యము :- 

సకల శాస్త్రములను క్షుణ్ణంగా గ్రహించిన జ్ఞానులైన బ్రాహ్మణులు, నీతోపాటు నీదేశ పౌరుల, గ్రామీణుల సుఖశాంతులు కోరుతున్నారు కదా? 

ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా; తే = నీ; బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; శర్మ = సుఖశాంతులు; సర్వ = సమస్తమైన; శాస్త్రాః = శాస్తములందలి; అ¬ర్థ = విషయము; కోవిదాః = తెలుసకున్నజ్ఞాని; ఆశంసంతే = కోరుతున్నారు; మహా = గొప్ప; ప్రాజ్ఞ = బుద్దిమంతుడా; పౌరః = పురవాసుల; జానపదైః = జనపదానివాసులు; సహ = సహితముగా.

2.100.65.అనుష్టుప్.

నాస్తిక్యమనృతం క్రోధమ్

ప్రమాదం దీర్ఘసూత్రతామ్।

అదర్శనం జ్ఞానవతామ్

ఆలస్యం పంచవృత్తితామ్॥

తాత్పర్యము :- 

1. నాస్తికత్వము, 2. అసత్యము, 3. క్రోధము, 4. ఏమఱుపాటప, 5. సాగతీతస్వభావము, 5. జ్ఞానవంతులవద్దకు పోకపోవుట, 6. సోమరితనము, పనిచేపట్టుటకు జాగుచేయుట, 8. పంచమనోవృత్తులు అగు ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్రమత్తు, స్మృతిరూపవాదము.

ప్రతిపదార్థము :- 

నాస్తిక్యమ్ = నాస్తికత్వము, దైవములేడనుట; అనృతమ్ = అసత్యము; క్రోధమ్ = అధికమైన కోపము; ప్రమాదం = ఏమఱుపాటు; దీర్ఘసూత్రతామ్ = ప్రతిపనికి సాగతీత స్వభావము, మితిమీరిన సమయం తీసుకొనుట; అదర్శనం = చూడకపోవుట, కలియకపోవుట; జ్ఞానవతామ్ = జ్ఞానవంతులను; ఆలస్యం = సోమరిపోతుతనము; పంచవృత్తితామ్ = పంచవృత్తులు, ఐదు నడవడికలు, శబ్దరత్నాకరము. 

*గమనిక :- 

;పంచవృత్తులు- పంచమనోవృత్తులు, సూ. ప్రమాణవిపర్య్యవికల్పనిద్రాస్మృతతయః, వాచస్పతము, ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్రమత్తు, స్మృతిరూపవాదము అను పంచమనోవృత్తులు, సంకేతపదకోశము.

2.100.66.అనుష్టుప్.

ఏకచింతనమర్థానామ్

అనర్థజ్ఞైశ్చ మంత్రణమ్।

నిశ్చితానామనారంభమ్

మంత్రస్యాపరిరక్షణమ్॥

తాత్పర్యము :- 

9. మంత్రులను సంబంధిచిన రాజోద్యోగులతో చర్చించకుండా రాజు తాను ఒక్కడే నిర్ణయము తీసుకొను ఆలోచనకూడ చేయుట. అటులనే 9. కార్య ప్రయోజనము తెలియని వారితో చర్చించుట. 1. నిర్ణయములు తీసుకొనట్టి కార్యములను మొదలుపెట్టకపోవుట. 12. మంత్రాగ విషయముల రహస్యము కాపాడకపోవుట.

ప్రతిపదార్థము :- 

ఏకచింతనమ్ = ఒంటరిగా ఆలోచన చేయడం; అర్థానామ్ = కార్యముల యొక్క; అనర్థజ్ఞైః = వివరము తెలియని వారు; చ = కూడా; మంత్రణమ్ = రాజకీయ తంత్ర ఆలోచన; నిశ్చితానామ్ = నిశ్చయింపబడినవి; అనారంభమ్ = మొదలుపెట్టక పోవుట; మంత్రస్యాః = ఆలోచన యొక్క; అపరిరక్షణమ్ = రహస్యమును కాపాడకపోవుట.

-----

శ్రీరామ రక్ష జగదభి రక్ష

Monday, July 22, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥ - 61, 62, 63

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]

2.100.61.అనుష్టుప్.

కచ్చిద్గురూంశ్చ వృద్ధాంశ్చ

తాపసాన్ దేవతాతిథీన్।

చైత్యాంశ్చ సర్వాన్సిధ్దార్థాన్

బ్రాహ్మణాంశ్చ నమస్యసి॥

తాత్పర్యము :- 

గురువులను, పెద్దలను, వృద్దులను, మునులను, దేవతలను, అతిథులను మఱియు దేవాలయము లన్నింటినీ ఇంకా కృతార్థులైన బ్రాహ్మణులను నమస్కరించుచుంటివి కదా?

ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా; గురూమ్ = గురువులను; చ = మఱియు; వృద్ధామ్ = పెద్దలను; చ = మఱియు; తాపసాన్ = మునులను; దేవతాః = దేవతలను; అతిథీన్ = అతిథులను; చైత్యామ్ = దేవాలయములు; చ = పాదపూరణము; సర్వాని = అన్నింటిని; సిధ్దార్థాన్ = కృతార్థులైన; బ్రాహ్మణామ్ = బ్రాహ్మణులను; చ = కూడ; నమస్యసి = నమస్కరించుచుంటివి.

2.100.62.అనుష్టుప్.

కచ్చిదర్థేన వా ధర్మమ్

అర్థం ధర్మేణ వా పునః।

ఉభౌ వా ప్రీతిలోభేన

కామేన చ న బాధసే॥

తాత్పర్యము :- 

ధర్మాచరణకు అగు (ఉదయము) సమయములలో ధనాది ప్రయోజనాలను అర్థము సంపాదించుట కొఱకు ధర్మమునకు లోపము చేయుట కాని, ధనార్జన చేయు (తదనంతర) సమయములలో ధర్మాచరణలో పడి అర్థము సంపాదించుటలో లోపము చేయుట కాని, సుఖించవలసిన (రాత్రి)  సమయములలో ధర్మాచరణ అర్థసంపాదనలలో పడి సుఖాభిలాష కామములను తీర్చుకొనుటలో లోపము చేయుటలేదు కదా? ధర్మార్థకామములను సమతూకములో నడుపుచుంటివి కదా?

ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా; అర్థేన = అర్థముచేత; వా = కాని; ధర్మమ్ = ధర్మము; అర్థమ్ = అర్థము; ధర్మేణ = ధర్మముచేత; వా = కాని; పునః = లేదా; ఉభౌ = రెంటిని; వా = కాని; ప్రీతి = సుఖమునందు; లోభేన = అత్యాశచే; కామేన = కామముచే; చ = మఱియు; న = లేదు; బాధసే = బాధించుట.

2.100.63.అనుష్టుప్.

కచ్చిదర్థం చ ధర్మం చ

కామం చ జయతాంవర!।

విభజ్య కాలే కాలజ్ఞ!

సర్వాన్వరద! సేవసే॥

తాత్పర్యము :- 

ఓ ఉత్తమజయశీలుడా! కాలజ్ఞుడా! కోరిన దానములు ఇచ్చువాడా! భరతుడా! ధర్మార్థకామములను అన్నింటినీ తగిన కాలములను తగువిధముగా విభజించుకొని సేవించుచుంటివి కదా?

ప్రతిపదార్థము :- 

కచ్చి = కదా; అర్థమ్ = అర్థము; చ = మఱియు; ధర్మమ్ = ధర్మము; చ = మఱియు; కామమ్ = కామము; చ = పాదపూరణము; జయతాంవర = జయశీలశ్రేష్ఠుడా; విభజ్య = విభజించుకొనుము; కాలే = కాలమును; కాలజ్ఞ = తగిన కాలముల గుఱించి ఎరిగినవాడ; సర్వాన్ = అన్నింటినీ; వరద = వరములను ఇచ్చువాడా; సేవసే = సేవించుచుంటివి.

*గమనిక :- 

;ధర్మార్థకామములకు సమయ విభజన- (అ)ధర్మాచరణకు ఉదయ కాలము అనుకూలము. (ఆ) తదనంతర సమయములలో అర్థ సంపాదనకు అనుకూలము. (ఇ) తదనంతరము సుఖించటకైన రాత్రి సమయము కామములు తీర్చుకొనుటకు అనుకూలము.

-----


శ్రీరామ రక్ష జగదభి రక్ష

Sunday, July 21, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥ - 58, 59, 60

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]



2.100.58.అనుష్టుప్.

వ్యసనే కచ్చిదాఢ్యస్య

దుర్గతస్య చ రాఘవ।

అర్థం విరాగాః పశ్యంతి

తవామాత్యా బహుశ్రుతాః॥

తాత్పర్యము :- 

సకల శాస్త్రకోవిదులైన నీ ఆమాత్యులు ఆపద వచ్చిన వాని విషయములో ధనికుడైన, పేదవాడైన పక్షపాతబుద్ధి లేకుండా ఆ ఆపదకు పరిష్కారము చేయుచుండిరి కదా?

ప్రతిపదార్థము :- 

వ్యసనే = కష్టమునందున్న; కచ్చిత్ = కదా; ఆఢ్యస్య = కధనికునియొక్క; దుర్గతస్య = దరిద్రునియొక్క; చ = మఱియు; రాఘవ = రఘువంశజుడా; అర్థమ్ = విషయములో; విరాగాః = పక్షపాతబుద్ధి లేకుండా; పశ్యంతి = చూచుచుండిరి; తవ = నీ; ఆమాత్యా = మంత్రుల; బహుశ్రుతాః = మిక్కిలి విద్యగలవారు.

2.100.59.అనుష్టుప్.

యాని మిథ్యాభిశస్తానామ్

పతంత్యశ్రూణి రాఘవ।

తాని పుత్రాన్పశూన్ఘ్నంతి

ప్రీత్యర్థమనుశాసతః॥

తాత్పర్యము :- 

రఘువంశపు భరతుడా! అపనింద మోపబడిన వాని విషయములో తన ఇష్టానుసారము అనర్హుమైన తీర్పుచెప్పినచో, ఆ అపనింద మోపబడినవాని కన్నీళ్ళు ఆ తీర్పు చెప్పిన వాని కొడుకులు పశువులు సంపదలు నశింపజేయును. 

ప్రతిపదార్థము :- 

యాని = ఏ; మిథ్యా = లేని; అభిశస్తానామ్ = నింద మోపబడినవాని; పతంతి = పడునో; అశ్రూణి = కన్నీళ్ళు; రాఘవ = రఘుకులజుడా; తాని = వాని; పుత్రాన్ = పుత్రులు; పశూన్ = పశువులు; ఘ్నంతి = చంపును; ప్రీత్యర్థమ్ = ఇష్టానుసారము; అనుశాసతః = తీర్పుచెప్పిన వానియొక్క.

2.100.60.అనుష్టుప్.

కచ్చిద్వృద్ధాంశ్చ బాలాంశ్చ

వైద్యాముఖ్యాంశ్చ రాఘవ।

దానేన మనసా వాచా

త్రిభిరేతైర్బుభూషసే॥

తాత్పర్యము :- 

ఓ భరతుడా! వృద్దులను, బాలురను, పండితోత్తములను దానములతోను, మనస్పూర్తిగా ఇష్ట పడుటతోను, మంచిమాటలతోనూ అను మూడు మార్గములతో వశపరచుకొనుచుంటివి కదా? 

ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా; వృద్ధామ్ = వృద్ధులను; చ = మఱియు; బాలామ్ = బాలురను; చ = మఱియు; వైద్యాః = పండితులైన; ముఖ్యామ్ = శ్రేష్ఠులను; చ = పాదపూరణము; రాఘవ = రఘువంశపువాడా; దానేన = దానముచేత; మనసా = మనసుచేత; వాచా = మాటలచేత; త్రిభిః = మూడింటిచేత; ఏతైః = ఈ; బుభూషసే = వశపరచుకొనుచుంటివి.

-----

శ్రీరామ రక్ష జగదభి రక్ష

Saturday, July 20, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥ 55,56 & 57

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]

2.100.55.అనుష్టుప్.

దేవతార్థే చ పిత్రర్థే
      బ్రాహ్మణాభ్యాగతేషు చ।
యోధేషు మిత్రవర్గేషు
      కచ్చిద్గచ్ఛతి తే వ్యయః॥

తాత్పర్యము :-
     
నీయొక్క వ్యయములు దేవకార్యముల కొఱకు, పిత్రుకార్యముల కొఱకు, బ్రాహ్మణ అతిథులకు, యుద్ధవీరులకు, మిత్రులు అందరికీ అందించుచుంటివి కదా?

ప్రతిపదార్థము :-
      దేవతాః
= దేవకార్యముల; అర్థే = కొఱకు; చ = మఱియు; పిత్రః = పిత్రు కార్యముల; అర్థే = కొఱకు; బ్రాహ్మణాః = బ్రాహ్మణులైన; అభ్యాగతేషు = అతిథి; చ = మఱియు; యోధేషు = యుద్ధవీరులకు; మిత్రవర్గేషు = మిత్రులు అందరికీ; కచ్చిత్ = కదా; గచ్ఛతి = వెళ్ళుచున్నది; తే = నీ; వ్యయః = వ్యయములు.

2.100.56.అనుష్టుప్.

కచ్చిదార్యో విశుద్ధాత్మా
      క్షారితశ్చాపకర్మణా।
అపృష్టశ్శాస్త్రకుశలైః
      న లోభాద్వధ్యతే శుచిః
॥

తాత్పర్యము :-
      గౌరవనీయుడు, పరిశుద్ధమైన మనసు కలవాడు దురాశవలన ఆరోపింపబడిన చేయని నేరమునకు, న్యాయకోవిదులచే పరీక్షింపబడకుండా మరణశిక్ష పొందుట లేదుకదా
?

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= కదా; ఆర్యః = గౌరవనీయుడు; విశుద్ధాత్మా = పరిశుద్ధమైన ఆత్మ కలవాడు; క్షారితః = ఆరోపింపబడినవాడై; చ = పాదపూరణము; అపకర్మణా = చెడ్డపనిచేత, నేరముచేత; అపృష్ట = ప్రశ్నింపకుండనే; శాస్త్రకుశలైః = న్యాయ శాస్తమునందు నేర్పరులచేత; న = లేదు; లోభాత్ = దురాశవలన; వధ్యతే = చంపుట; శుచిః = నేరము చేయనివాడు.

2.100.57.అనుష్టుప్.

గృహీతశ్చైవ పృష్టశ్చ
      కాలే దృష్టస్సకారణః।
కచ్చిన్న ముచ్యతే చోరో
      ధనలోభాన్నరర్షభ
॥

తాత్పర్యము :-
      ఓ పురుషశ్రేష్ఠుడా
! భరతా! దొంగతనము వంటి నేరము చేసినట్లు సాక్ష్యము, చేయుటకు కారణము ఉండి, న్యాయాధికారుల పరీక్షలో ఋజువు కాబడిన నేరస్తుడు ధనాశవలన విడువబడుట లేదుకదా!

ప్రతిపదార్థము :-
      గృహీతః
= ఋజువైనవాడు; చైవ = మాత్రము; పృష్టః = ప్రశ్నింపబడిన వాడు; చ = మఱియు; కాలే = ఆ సమయమునందు; దృష్టః = చూడబడిన వాడు; సకారణః = కారణము ఉన్నవాడు; కచ్చిత్ = కదా; న = లేదు; ముచ్యతే = విడువబడుట; చోరః = చోరుడు; ధనలోభాన్ = ధనాశవలన; నరర్షభ = పురుషశ్లేష్ఠుడా.

-----

శ్రీరామ రక్ష జగదభి రక్ష

Friday, July 19, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥ 52,53,54

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]


2.100.52.అనుష్టుప్.

కచ్చిన్న సర్వే కర్మాంతా
      ప్రత్యక్షాస్తేఽవిశంకయా।
సర్వే వా పునరుత్సృష్టా
      మధ్యమేవాత్ర కారణమ్
॥

తాత్పర్యము :-
      నీ సేవకులు, పనిచేయు కార్మికులు అందరూ నీ ఎదుటకు వచ్చుటకు సందేహించుట లేదు కదా
? లేక భయాతిశయముచేత దూరందూరముగా ఉండిపోతున్నారా? ఈ విషయంలో మధ్యేమార్గము అవలంభించుట మంచిది.

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= కదా; న = కాదు; సర్వే = అందరు; కర్మాంతా = కార్మికులు; ప్రత్యక్షః = ఎదుటకు; అస్తి = వచ్చుటకు; తే = నీకు; అవిశంకయా = సందేహము లేకుండా; సర్వే = అందరు; వా = లేదా; పునః = మరీ; ఉత్సృష్టా = దూరముగా ఉంచబడినవారు; మధ్యమేవ = మధ్యేమార్గము; అత్ర = ఈ విషయము నందు; కారణమ్ = శ్రేయస్సుకు కారణము.

2.100.53.అనుష్టుప్.

కచ్చిత్సర్వాణి దుర్గాణి
      ధనధాన్యాయుధోదకైః।
యన్త్రేశ్చ పరిపూర్ణాని
      తథా శిల్పిధనుర్ధరైః॥

తాత్పర్యము :-
     
కోటలు అన్నింటిలోనూ యుద్దము, ప్రకృతి వైపరీత్యాది అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనుటకు అవసరమైనవి కోశాగారమున, ధాన్యాగారమున, జలవనరులందు, ఆయుధగారమున, మానవ వనరులు, బలవనరులు సర్వం ఎల్లప్పుడు సిద్దంగా ఉంటున్నవి కదా.

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= కదా; సర్వాణి = సమస్తమైన; దుర్గాణి = కోటలలోను; ధనః = ధనము; ధాన్యః = ధాన్యము మొదలగునవి; ఆయుధః = ఆయుధములు; ఉదకైః = జలపూర్ణమైన జలవనరులు; యన్త్రైః = యంత్రములు; చ = మఱియు; పరిపూర్ణాని = సుసంమృద్దిగా; తథా = అలాగే; శిల్పిః = వడ్రంగిలోనగువారు; ధనుర్ధరైః = విలుకాండ్రు.

*గమనిక :-

      (1) రాజ్యమునందు అత్యవసర సమయాలకోసం నిల్వ ఉంచుకొన వలసినవి (అ) కోశాగారము నందు జీతభత్యములు మున్నగు వానికి సరిపడు ధనము. (ఆ) ధాన్యాగారము నందు కోటదాటి వెళ్ళక్కరలేకుండా పరివారము, సైన్యము, ప్రజలు అందరికీ అవసరమైన ధాన్యము మున్నగు ఆహారపదార్థముల నిల్వలు. (ఇ) జలవనరులు అత్యవసర పరిస్థితులకును సరిపడు జలపూర్ణమైనవి అయిన సరోవరములు నూతులు మున్నగునవి. (ఈ) ఆయుధగారము నందు శత్రువులను ఎదుర్కొనుటకు వలసిన ఆయుధముల యుద్ధపరికరముల నిల్వలు. యంత్రాగారమున కోటగోడ పై భాగమున శత్రువులపై దాడి చేయుకు వలసిన సాధనములు పరికరములు, వాటి విడిభాగములు, ఆయుధములు తయారు చేయు యంత్రములు, తిరుగలి, రుబ్బురోలు, జలయంత్రము, నేతమగ్గములు మున్నగు కీలు పనిముట్లు. (ఉ) మానవ వనరులు వడ్రంగిలోనగువారు మఱియు విలుకాండ్రు మున్నగు వృత్తినిపుణులు. వడ్లంగిలోనగువాఁరు- వీరు ఐదుగురు, వడ్లంగి/ వడ్రంగి- కొయ్యపని వారు, సాలె- నేతపనివారు, మంగలి- క్షురకులు, చాకలి- బట్టలు శుభ్రపరచువారు, ముచ్చి- రంగులు వేయువారు. శబ్దరత్నాకరము. (ఊ) బలసంగ్రహణములు విలుకాండ్రు, గజ, తురగ, రథ, పదాది సైనిక బలములు.

2.100.54.అనుష్టుప్.

ఆయస్తే విపులః కచ్చిత్
      కచ్చిదల్పతరో వ్యయః।
అపాత్రేషు న తే కచ్చిత్
      కోశో గచ్ఛతి రాఘవ
!॥

తాత్పర్యము :-
     
ఓ రఘువంశపు భరతుడా! నీ ఆదాయము అధికముగాను, వ్యయము మిక్కిలి తక్కువగాను ఉన్నవి కదా? నీ కోశాగారమునుండి అనర్హులకు ఇచ్చుట లేదు కదా? అనవసర వ్యయములు చేయుట లేదుకదా?

ప్రతిపదార్థము :-
      ఆయః
= ఆదాయము; తే = నీ; విపులః = అధికముగా ఉన్నది; కచ్చిత్ = కదా; కచ్చిత్ = కదా; అల్పతరః = మిక్కిలి తక్కువగ ఉన్నది; వ్యయః = వ్యయము; అపాత్రేషు = అనర్హులకు; న = లేదు; తే = నీ; కచ్చిత్ = కదా; కోశః = కోశాగారమునుండి; గచ్ఛతి = పోవుట; రాఘవ = రఘువంశజ్ఞుడా.

*గమనిక :-

      ;అర్థశాస్త్ర సూత్రముల ప్రకారము ఆదాయముల కంటె వ్యయములు బాగా తక్కువ ఉండవలెను. అనవసర వ్యయములు జరుగ రాదు. మిగులు ధనములు భవిష్యత్కాల అవసరములకు, అత్యవసర సమయములలోని అవసరములకు, సంపదవృద్ధికిని దాచుకొనవలెను


శ్రీరామ రక్ష జగదభి రక్ష