10.1-402-కంద పద్యము
బాలుఁడు ఱో లడ్డము దివ
మూలంబులు పెకలి విటపములు విఱిగి మహా
భీలధ్వనిఁ గూలెను శా
పాలస్య వివర్జనములు యమళార్జునముల్
ఆ కృష్ణబాలుడు అడ్డం పడిన రోలుని
లాగాడు. దాంతో ఆ జంట మద్దిచెట్లు రెండూ వేళ్ళతో సహా పెకలించుంకొనిపోయి, కొమ్మలు
విరిగిపోతూ మహాభయంకరమైన ధ్వనితో నేలకూలిపోయాయి. చాలా కాలం తరువాత వాటికి శాపాలు
తొలగిపోయాయి.
10.1-402-kaMda padyamu
baaluM~Du RrO laDDamu diva
moolaMbulu pekali viTapamulu viRrigi mahaa
bheeladhvaniM~ goolenu shaa
paalasya vivarjanamulu yamaLaarjunamul
బాలుడు = బాలకృష్ణుడు; ఱోలు = రోలు; అడ్డమున్ = అడ్డముగా; తివన్ = లాగుటచేత; మూలంబులు = వేళ్లతోసహా; పెకలి = పెల్లగిల్లి; విటపములు = చెట్లు; విఱిగి = విరిగిపోయి; మహా = మిక్కిలి; అభీల = భయంకరమైన; ధ్వనిన్ = శబ్దముతో; కూలెను = పడిపోయెను; శాపా = శాపమువలన కలిగిన; అలస్య = అలసత్వమును; వివర్జనములున్ = తొలగినవి; యమళ = జంట; అర్జునములు = మద్దిచెట్లు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment