10.1-414-తేటగీతి
పిడుగు పడదు; గాక పెనుగాలి విసరదు;
ఖండితంబు లగుట గానరాదు;
బాలుఁ డితఁడు; పట్టి పడఁ ద్రోయఁజాలఁడు;
తరువు లేల గూలె ధరణిమీఁద”
అసలు ఈ మహా వృక్షాలు ఎలా పడిపోయాయి? పిడుగు పడింది లేదు. పోనీ పెద్దగాలి వీచిందా అంటే అదిలేదు. ఎవరు నరికిన
సూచనలు ఏమి లేవు. కూకటి వేళ్ళతో సహా కూలిపోయాయి. ఈ పిల్లాడు ఏమైనా పడగొట్టాడు
అనుకుందా మంటే మరీ ఇంత పసిపిల్లాడు అంత పెద్ద చెట్లను పడ తొయ్యటం అసాధ్యం కదా! మరి
అయితే ఈ చెట్లు ఎలా కూలిపోయినట్లు?"
అని నందుడు
మొదలైన గోపాలకులు అనుకుంటున్నారు.
10.1-414-tETageeti
piDugu paDadu; gaaka penugaali visaradu;
khaMDitaMbu laguTa gaanaraadu;
baaluM~ DitaM~Du; paTTi paDaM~ drOyaM~jaalaM~Du;
taruvu lEla goole dharaNimeeM~da”
పిడుగు = పిడుగేమీ; పడదు = పడలేదు; కాక = అదికాకుండ; పెనుగాలి = గట్టిగాలి; విసరదు = వేయలేదు; ఖండితంబులు = నరకబడినవి; అగుటన్ = అగుటకూడ; కానరాదు = కనబడదు; బాలుడు = చిన్నపిల్లవాడు; ఇతడున్ = ఇతను; పట్టి = పట్టుకొని; పడద్రోయన్ = పడునట్లుతోయుటకు; చాలడు = సరిపడడు; తరువులు = వృక్షములు; ఏలన్ = ఎందుచేత; కూలెన్ = పడిపోయినవి; ధరణి = నేల; మీదన్ = మీద.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment