1-192-వ.
మఱియు భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును, రాగాదిరహితుండును, కైవల్యదాన సమర్థుండును, గాలరూపకుండును, నియామకుండును, నాద్యంతశూన్యుండును, విభుండును, సర్వసముండును, సకల భూత
నిగ్రహానుగ్రహకరుండు నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము; మనుష్యుల
విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వఁడు సమర్థుండు నీకుం
బ్రియాప్రియులు లేరు జన్మకర్మశూన్యుండ వయిన నీవు తిర్యగాదిజీవుల యందు వరాహాది
రూపంబులను మనుష్యు లందు రామాది రూపంబులను ఋషుల యందు వామనాది రూపంబులను జలచరంబుల యందు
మత్స్యాది రూపంబులను నవతరించుట లోకవిడంబనార్థంబు గాని జన్మకర్మసహితుం
డవగుటం గాదు.
మఱియున్ = ఇంకను; భక్త =
భక్తులకు; ధనుండును =
ధనము అయిన వాడును; నివృత్త = నివారింపబడిన; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామ = కామ; విషయుండును = విషయములు కలవాడు; రాగ = అనురాగము విరాగము; ఆది = మొదలగునవి; రహితుండును = లేనివాడును; కైవల్య = మోక్షమును {కైవల్యము - కేవలము తన వలె నగు స్థితి, మోక్షము}; దాన = యిచ్చుటకు; సమర్థుండును = సమర్థత గలవాడును; కాల = కాలమే; రూపకుండును = స్వరూపముగ నున్నవాడు; నియామకుండును = (సర్వ) నియంతయును; ఆది = ఆది; అంత = అంతములు; శూన్యుండును = లేనివాడును; విభుండును = ప్రభువు; సర్వ = సమస్తమునందు; సముండును = సమదృష్టి కలవాడు; సకల = సమస్త; భూత = భూతముల యందు / జీవులకును; నిగ్రహ = నిగ్రహము; అనుగ్రహ = అనుగ్రహము; కరుండున్ = చేయువాడును; ఐన = అయినట్టి; నిన్నున్ = నిన్ను; తలంచి = స్మరించి; నమస్కరించెదన్ = నమస్కరిస్తున్నాను; అవధరింపుము = స్వీకరింపుము; మనుష్యులన్ = మానవులను; విడంబించు = భ్రమింపజేయు; భవదీయ = నీ యొక్క; విలసనంబున్ =
విలాసములను; నిర్ణయింపన్ =
వర్ణింపను; ఎవ్వఁడు = ఎవడు; సమర్థుండు = సమర్థత గలవాడు; నీకున్ = నీకు; ప్రియ = ప్రియమైనవారును; అప్రియులు = ప్రియముకానివారును; లేరు = లేరు; జన్మ = జన్మమును; కర్మ = కర్మమును; శూన్యుండవు = లేనివాడవు; అయిన = అయినట్టి; నీవు = నీవు; తిర్యక్ = పశుపక్ష్యాదులు {తిర్యక్ - చలనముగలవి / పశుపక్ష్యాదులు}; ఆది = మొదలగు; జీవుల = జీవుల; అందున్ = లో; వరాహ = వరాహము; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; మనుష్యుల = మానవుల; అందున్ = లో; రామ = రాముడు; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; ఋషుల = ఋషుల; అందున్ = లో; వామన =
వామనుడు; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; జలచరంబుల = జలచరముల; అందున్ = లో; మత్య = చేప; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; అవతరించుట = అవతరించుట; లోక = లౌకిక విధానాలను; విడంబన = అనుసరించుట; అర్థంబున్ = కొరకు; కాని = తప్ప; జన్మ = జన్మములను; కర్మ = కర్మములను; సహితుండవు = కలిగివుండు వాడవు; అగుటన్ =
అగుటవలన; కాదు = కాదు.
కృష్ణా! నీవు
భక్తులకు కొంగుబంగారానివి; ధర్మార్థ సంబంధమైన వ్యామోహాన్ని తొలగించే వాడివి; ఆత్మారాముడివి; శాంతమూర్తివి; మోక్షప్రదాతవు; కాలస్వరూపుడివి; జగన్నియంతవు; ఆద్యంతాలు
లేనివాడవు; సర్వేశ్వరుడవు; సర్వసముడవు; నిగ్రహానుగ్రహ సమర్థుడవు; మానవభావాన్ని
అనుకరిస్తూ వర్తించే నీ లీలలు గుర్తించటం ఎవరికి సాధ్యం కాదు; నీకు
ఐనవారు కానివారు లేరు; జన్మకర్మలు లేవు; జంతువులలో
వరాహాదిరూపాలతో, జలచరాలలో మత్స్యాదిరూపాలతో నీవు అవతరించటం లోకం కోసమే
కాని నిజానికి నీకు జన్మాదులు లేనే లేవు; నీ ప్రభావాన్ని భావించి
నేను చేసే నమస్కారాలు స్వీకరించు.
1-192-vachanamu
maRriyu bhaktadhanuMDunu,
nivRittadharmaarthakaama viShayuMDunu, raagaadirahituMDunu, kaivalyadaana
samarthuMDunu, gaalaroopakuMDunu, niyaamakuMDunu, naadyaMtashoonyuMDunu,
vibhuMDunu, sarvasamuMDunu, sakala bhoota nigrahaanugrahakaruMDu naina ninnuM~
dalaMchi namaskariMcheda navadhariMpumu; manuShyula viDaMbiMchu bhavadeeya
vilasanaMbu nirNayiMpa nevvaM~Du samarthuMDu neekuM briyaapriyulu lEru
janmakarmashoonyuMDa vayina neevu tiryagaadijeevula yaMdu varaahaadi
roopaMbulanu manuShyu laMdu raamaadi roopaMbulanu RiShula yaMdu vaamanaadi
roopaMbulanu jalacharaMbula yaMdu matsyaadi roopaMbulanu navatariMchuTa
lOkaviDaMbanaarthaMbu gaani janmakarmasahituM DavaguTaM gaadu.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment