Friday, May 1, 2015

కృష్ణలీలలు

10.1-380-కంద పద్యము
ఱోను కట్టుపడియు న
బ్బాలుఁడు విలసిల్లె భక్త రతంత్రుండై
యాలాన సన్నిబద్ద వి
శామదేభేంద్రకలభ మరుచి నధిపా!
            పరీక్షిన్మహారాజా! బాలగోపాలుడు భక్తుల వశంలో ఉండే వాడు గనుక తను రోటికి కట్టిబడిపోయి ఉన్నాడు. దానికి అతడు ఏమాత్రం బిక్కమొగం వేయలేదు. పైగా కట్టుకొయ్యకు కట్టబడిన గున్న ఏనుగు వలె హుందాగా వెలిగిపోతున్నాడు.
10.1-380-kaMda padyamu
RrOlanu kaTTupaDiyu na
bbaaluM~Du vilasille bhakta parataMtruMDai
yaalaana sannibadda vi
shaalamadEbhEMdrakalabha samaruchi nadhipaa!
          ఱోలను = రోటికి; కట్టుపడియున్ = కట్టివేయబడి; = ; బాలుడు = బాలకృష్ణుడు; విలసిల్లెన్ = ఒప్పెను; భక్త = భక్తులకు; పరతంత్రుండు = లోబడునట్టివాడు; = అయ్యి; ఆలాన = ఏనుగుకట్టుకొయ్యకు; సత్ = మిక్కిలి; నిబద్ధ = కట్టివేయబడినట్టి; విశాల = అధికమైన; మద = మదించిన; ఇభ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠము; కలభ = గున్నతో; సమ = సమానమైన; రుచిన్ = ప్రకాశముతో; అధిపా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: