10.1-418-శార్దూల విక్రీడితము
పాడున్ మందుని భంగి; గోపవనితల్ పాణిధ్వనుల్ సేయఁగా
నాడున్ జంత్రముకైవడిం; బరవశుండై హస్తముల్ త్రిప్పుచుం;
జూడన్ నేరని వాని భంగి జనులం జూచున్; నగున్; బాలురం
గూడుం బెద్దలపంపు చేయఁజను; డాగున్; మట్టిఁ జిట్టాడుచున్.
అమాయకపు పిల్లాడిలా పాటలు పాడుతాడు,
గోపికాస్త్రీలు చేతులతో లయబద్ధంగా చప్పట్లి చరుస్తూ ఉంటే, పరవశుడై కీలుబౌమ్మలా చేతులు
తిప్పుతూ నాట్యాలు చేస్తాడు. చూడటం తెలియవానిలా జనుల వంక పలకరింపుగా చూస్తాడు.
నవ్వుతాడు, తోటి పిల్లలతో కలుసి గంతులు వేస్తాడు. పెద్దవారు ఏమైనా చెప్తే
బుద్ధిమంతునిలా చేస్తాడు. తలుపుచాటున దాక్కుంటాడు. మట్టిలో ఆడతాడు.
కూలిన మద్దిచెట్లు చూసి తర్కించుకుంటున్న
నందాదుల మనసులు మళ్ళించటానికి ఇలా ప్రవర్తించాడు చిన్నికన్నయ్య.
10.1-418-shaardoola vikreeDitamu
paaDun maMduni bhaMgi; gOpavanital paaNidhvanul
sEyaM~gaa
naaDun jaMtramukaivaDiM; baravashuMDai hastamul
trippuchuM;
jooDan nErani vaani bhaMgi janulaM joochun; nagun;
baaluraM
gooDuM beddalapaMpu chEyaM~janu; Daagun; maTTiM~
jiTTaaDuchun.
పాడున్ = గీతములు పాడును; మందుని = ఏమీతెలియనివాని; భంగిన్ = విదముగ; గోపవనితలు = గోపికలు; పాణిధ్వనుల్ = చప్పట్లు; చేయగాన్ = కొడుతుండగా; ఆడున్ = నాట్యముచేయును; జంత్రము = కీలుబొమ్మ; కైవడిన్ = వలె; పరవశుండు = మిక్కిలిఆనందించువాడు; ఐ = అయ్యి; హస్తముల్ = చేతులు; త్రిప్పుచున్ = ఆడించుచు; చూడన్ = చూడ్డానికి; నేరనివాని = ఏమీతెలియనివాని; భంగిన్ = వలె; జనులన్ = ప్రజలను; చూచున్ = చూచును; నగున్ = నవ్వును; బాలురన్ = పిల్లలతో; కూడున్ = కలియును; పెద్దల = పెద్దవారి; పంపున్ = చెప్పినపనిని; చేయన్ = చేయుటకు; చనున్ = వెళ్ళును; డాగున్ = మరుగునదాగును; మట్టిన్ = మట్టిలో; చిట్టాడుడుచున్ = చిమ్ముకొనుచు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment