Sunday, May 24, 2015

కుంతి స్తుతి - మలయమున


1-194-క.
యమునఁ జందనము క్రియ
వెయఁగ ధర్మజుని కీర్తి వెలయించుటకై
యిపై నభవుఁడు హరి యదు
కుమున నుదయించె నండ్రు గొం, ఱనంతా!
          మలయమునన్ = మలయపర్వతముమీది; చందనము = గంధపుచెట్టు సువాసన; క్రియన్ = వలె; వెలయఁగన్ = విస్తరించునట్లు; ధర్మజుని = ధర్మరాజు యొక్క {ధర్మజుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; కీర్తి = కీర్తిని; వెలయించుట = ప్రకాశింజేయుట; కై = కోసం; ఇల = భూమి; పై = మీద; అభవుఁడు = పుట్టకలేనివాడు, కృష్ణుడు; హరి = కృష్ణుడు; యదు = యదు; కులమునన్ = వంశములో; ఉదయించెన్ = అవతరించెను; అండ్రు = అందురు; కొందఱు = కొందరు; అనంతా = అంతము లేనివాడా,/ కృష్ణా.
         ధర్మనందనుని యశస్సు, మలయపర్వతం మీద చందనవృక్షం సువాసనల చందాన, సలుదెసలా ప్రసరింపజేయటానికి, శ్రీకృష్ణా! పుట్టుక ఎరుగని పురుషోత్తముడవైన నీవు యదువంశంలో ఉదయించావని కొంద రంటారు.
1-194-kaMda padyamu
malayamunaM~ jaMdanamu kriya
velayaM~ga dharmajuni keerti velayiMchuTakai
yilapai nabhavuM~Du hari yadu
kulamuna nudayiMche naMDru goMda RranaMtaa!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: