Friday, May 15, 2015

కృష్ణలీలలు

10.1-421-కంద పద్యము
బిక్షులు వచ్చెద రేడ్చిన;
బిక్షాపాత్రమున వైచి బెగడించి నినున్
శిక్షించెద; రని చెప్పిన
బిక్షులఁ గని, తల్లిఁ గనియు భీతిల్లె నృపా!
         ఓ మహారాజా! యశోదాదేవి ఏడవుకురా కన్నా! ఇదిగో బిచ్చగాళ్లు వస్తున్నారు. ఏడుస్తుంటే వాళ్ళు నిన్ను జోలెలో వేసుకొని తీసుకెళ్ళి కొడతారు జాగ్రత్త అని బెదిరించింది. చిన్నికిట్టయ్య వాకిట్లోకి వచ్చిన బిచ్చగాళ్లను చూసి, తల్లి వైపు భయపడుతూ చూసాడు.
10.1-421-kaMda padyamu
bikShulu vachcheda rEDchina;
bikShaapaatramuna vaichi begaDiMchi ninun
shikShiMcheda; rani cheppina
bikShulaM~ gani, talliM~ ganiyu bheetille nRipaa!  
          బిక్షులు = అడుక్కొనెడివారు; వచ్చెదరు = వస్తారు; ఏడ్చినన్ = ఏడ్చినచో; భిక్షాపాత్రమునన్ = బిక్షాపాత్రయందు; వైచి = వేసుకొని; బెగడించి = బెదిరించి; నినున్ = నిన్ను; శిక్షించెదరు = దండింతురు; అని = అని; చెప్పినన్ = చెప్పినచో; బిక్షులన్ = బిచ్చగాళ్ళను; కని = చూసి; తల్లిన్ = తల్లిని; కనియున్ = కనుగొనినను; భీతిల్లె = భయపడెను; నృపా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: