10.1-401-వచనము
చని యా యూర్జిత మహాబలుండు
నిజోదరదామ సమాకృష్యమాణ తిర్యగ్భవదులూఖలుండై యా రెండు మ్రాకుల నడుమం జొచ్చి
ముందరికి నిగుడుచు.
దృఢమైన
బలము కల ఆ కృష్ణబాలకుడు, తన పొట్టకు కట్టిన త్రాటిని బలంగా ఊపాడు, రోలు
అడ్డంతిరిగిపోయింది. అతడు చెరచెరా మద్దిచెట్లు రెంటి మధ్యనుండి దూరి రోలును
ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
10.1-401-vachanamu
chani yaa yoorjita mahaabaluMDu nijOdaradaama
samaakRiShyamaaNa tiryagbhavadulookhaluMDai yaa reMDu mraakula naDumaM jochchi
muMdariki niguDuchu.చని = వెళ్ళి; ఆ = ఆ; ఊర్జిత = దృఢమైన; మహా = గొప్ప; బలుండు = శక్తిశాలి; నిజ = తన యొక్క; ఉదర = పొట్టకి; దామ = కట్టబడి; సమా = చక్కగా; ఆకృష్యమాణ = లాగబడుచున్నట్టి; తిర్యక్ = తిరుగుచున్నది; భవత్ = అగుచున్న; ఉలూఖలుండు = రోలుకలవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; రెండు = రెండు (2); మ్రాకుల = చెట్ల; నడుమన్ = మధ్యన; చొచ్చి = దూరి; ముందరి = ముందు; కిన్ = కి; నిగుడుచున్ = నిక్కుచు.
No comments:
Post a Comment