1-196-క.
జలరాశి నడుమ
మునిగెఁడు
కలము క్రియన్
భూరిభారకర్శితయగు నీ
యిలఁ గావ నజుఁడు
గోరినఁ
గలిగితి వని కొంద
ఱండ్రు, గణనాతీతా!
జలరాశి = సముద్రము; నడుమ = మధ్యన; మునిగెఁడు = మునిగిపోతున్న; కలము = ఓడ; క్రియన్ = వలె; భూరి = అత్యంత; భార = భారముతో; కర్శిత = పీడితము; అగు = అయినట్టి; ఈ = ఈ; ఇలన్ = భూమిని; కావన్ = కాపాడుటంకోసం; అజుఁడు = బ్రహ్మ {అజుఁడు - భౌతిక జన్మము లేనివాడు, బ్రహ్మ}; కోరినన్ = కోరగా; కలిగితివి = అవతరించావు; అని = అని; కొందఱు = కొందరు; అండ్రు = అంటారు; గణనాతీతా = కృష్ణా {గణనాతీత - ఎంచుటకు అతీతమైన వాడు, కృష్ణుడు}.
బ్రహ్మదేవుడు ప్రార్థింపగా నట్టనడి
సముద్రంలో మునిగిపోతున్న నావలాగ భరింపరాని బరువుతో క్రుంగిపోతున్న
భూమండలాన్ని ఉద్ధరించటం కోసం, అంచనాలకి అందని అనంతా! శ్రీకృష్ణా! నీవు
అవతారం ఎత్తావంటారు మరికొందరు.
1-196-kaMda padyamu
jalaraashi naDuma munigeM~Du
kalamu kriyan bhooribhaarakarshitayagu
nee
yilaM~ gaava najuM~Du gOrinaM~
galigiti vani koMda RraMDru
gaNanaateetaa!
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment