1-191-క.
జననము, నైశ్వర్యంబును,
ధనమును, విద్యయును, గల మదచ్ఛన్ను లకిం
చనగోచరుఁడగు
నిన్నున్
జననమున్ = పుట్టుటయు; ఐశ్వర్యంబును = సంపదయు; ధనమును = విత్తమును; విద్యయును = విద్యయును; కల = కలుగుటవలన; మదచ్ఛన్నులు = గర్వముతో కప్పబడినవారు; అకించనగోచరుఁడు = అల్పులు కాని వారికి కనబడువాడు; అగు = అయినట్టి; నిన్నున్ = నిన్ను; వినుతింపఁగన్ = కీర్తించ; లేరు = లేరు; నిఖిలవిబుధస్తుత్యా = జ్ఞానులు అందరిచేత కీర్తింపబడేవాడా (కృష్ణా).
నిష్కాములైన భక్తులకు
మాత్రమే గోచరించేవాడు, నిఖిల దేవతా సంస్తూయమానుడు అయిన నిన్ను, గొప్పవంశంలో
జన్మించామనీ, భోగభాగ్యలు ఉన్నాయినీ, ధనంవంతులము అనీ, విద్యావంతులము అనీ
మదాంధులైన మానవుల ప్రస్తుతింపలేరు.
1-191-kaMda padyamu
jananamu naishvaryaMbunu
dhanamunu vidyayunu gala
madachchhannula kiM
chanagOcharuM~Dagu ninnun
vinutiMpaM~ga lEru
nikhilavibudhastutyaa!
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment