10.1-386-వచనము
అప్పు డా యవ్వయు
గోపికలును వెఱంగుపడిరి; తదనంతరంబ
10.1-387-ఆటవెలది
ఒడలఁ జెమట లెగయ నుత్తరీయము జాఱ
వీడి యున్న తుఱుము విరులు రాలఁ
గట్టరాని తన్నుఁ గట్టెద నని చింతఁ
గట్టుకొనిన తల్లిఁ గరుణఁ జూచి.
10.1-388-కంద పద్యము
బంధవిమోచనుఁ డీశుఁడు
బంధింపఁ బెనంగు జనని పాటోర్చి సుహృ
ద్బంధుఁడు గావున జననీ
బంధంబునఁ గట్టుపడియెఁ బాటించి నృపా!
ఆప్పుడు ఆ వింతను, పిల్లాణ్ణి చూసి
యశోదా, గోపికలూ నివ్వెరపోయారు.
పడుతున్న శ్రమకు యశోద శరీరమంతా చమటలు
పట్టాయి. కొప్పు వదులైపోయి పువ్వులు రాలిపోయాయి. అలా కట్టటానికి శక్యంకాని తనను
కట్టాలనే పట్టుదలతో తల్లి పడుతున్న తంటాలు చూసి నల్లనయ్య జాలి పడ్డాడు.
ఓ పరీక్షిన్మహారాజా! భగవంతుడు, భవబంధాలను తొలగించి మొక్షాన్ని ప్రసాదించేవాడు
అయిన కృష్ణబాలుడు. ఇప్పుడు ఆయన కన్నతల్లి కష్టం చూడలేక అలా త్రాడుకి
కట్టుపడిపోయాడు. అతడు ఆప్తులైన వారికి ఆత్మబంధువు గదా!
10.1-386-vachanamu
appu Daa yavvayu gOpikalunu veRraMgupaDiri;
tadanaMtaraMba
10.1-387-aaTaveladi
oDalaM~ jemaTa legaya nuttareeyamu jaaRra
veeDi yunna tuRrumu virulu raalaM~
gaTTaraani tannuM~ gaTTeda nani chiMtaM~
gaTTukonina talliM~ garuNaM~ joochi.
10.1-388-kaMda padyamu
baMdhavimOchanuM~ DeeshuM~Du
baMdhiMpaM~ benaMgu janani paaTOrchi suhRi
dbaMdhuM~Du gaavuna jananee
baMdhaMbunaM~ gaTTupaDiyeM~ baaTiMchi nRipaa!
అప్పుడు = ఆ సమయమునందు; అవ్వయున్ = తల్లి; గోపికలునున్ = గోపికలు; వెఱంగుపడిరి = ఆశ్చర్యపోయిరి; తదనంతరంబ = ఆ తరువాత.
ఒడలన్ = ఒంటినిండా; చెమటల్ = చెమట; ఎగయన్ = ఎగజిమ్మగా; ఉత్తరీయమున్ = కొంగు; జాఱన్ = జారిపోగా; వీడి = వదులైపోయి; ఉన్న = ఉన్నట్టి; తుఱుమున్ = జుట్టుముడినుండి; విరులు = పువ్వులు; రాలన్ = రాలిపోతుండగా; కట్టరాని = లోబడజేసుకొననశక్యమైన; తన్నున్ = అతనిని; కట్టెదను = కట్టివేసెదను; అని = అనెడి; చింతన్ = విచారము; కట్టుకొనిన = మూటగట్టుకొనిన; తల్లిన్ = తల్లిని; కరుణన్ = దయతో; చూచి = చూసి.
బంధ = సంసారబంధములను; విమోచనుడు = తొలగిచువాడు; ఈశుడు = బాలకృష్ణుని; బంధింపన్ = కట్టివేయుటకు; పెనంగు = పెనగులాడుచున్నట్టి; జనని = తల్లి; పాటున్ = శ్రమను; ఓర్చి = సహించి; సుహృత్ = ఆప్తులకు; బంధుడు = బంధువు; కావునన్ = కనుక; జననీ = తల్లి యొక్క; బంధంబునన్ = బంధింపబడుటకు; కట్టుపడియెన్ = కట్టుబడిపోయెను; పాటించి = పూని; నృపా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment