Tuesday, May 5, 2015

కృష్ణలీలలు

10.1-400-కంద పద్యము
ముద్దుల తక్కరిబిడ్డఁడు
ద్దులఁ గూల్పంగ దలఁచి సలక తా నా
ద్దికవ యున్న చోటికిఁ
గ్రద్దన ఱో లీడ్చుకొనుచుఁ డకం జనియెన్.
         ఆ టక్కులమారి ముద్దుకృష్టుడు ఆ రెండు మద్దిచెట్లను కూల్చాలని సంకల్పించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మద్దిచెట్ల జంట దగ్గరకు అమాతంగా రోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు.
10.1-400-kaMda padyamu
muddula takkaribiDDaM~Du
maddulaM~ goolpaMga dalaM~chi masalaka taa naa
maddikava yunna chOTikiM~
graddana RrO leeDchukonuchuM~ gaDakaM janiyen.
          ముద్దుల = మనోజ్ఞమైన; తక్కరి = టక్కులమారి; బిడ్డడు = బాలకుడు; మద్దులన్ = మద్దిచెట్లను; కూల్పంగన్ = పడద్రోయవలెనని; తలచి = అనుకొని; మసలక = ఆలస్యము చేయక; తాన్ = అతను; = ; మద్ది = మద్దిచెట్ల; కవ = జంట; ఉన్న = ఉన్నట్టి; చోటు = స్థలమున; కిన్ = కు; గ్రద్దనన్ = శీఘ్రముగా; ఱోలున్ = రోటిని; ఈడ్చుకొనుచున్ = లాగుకొంటూ; కడకన్ = పూని; చనియెన్ = వెళ్ళెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: