Sunday, May 17, 2015

కుంతి స్తుతి - పురుషుండాఢ్యుడు

1-187-కందపద్యము
"పురుషుం, డాఢ్యుఁడు, ప్రకృతికిఁ
రుఁ, డవ్యయుఁ, డఖిలభూత హిరంతర్భా
సురుఁడును, లోకనియంతయుఁ,
మేశ్వరుఁడైన నీకుఁ బ్రణతులగు హరీ!
      పురుషుండు = పరమ పురుషుడును {పురుషుండు - శరీరములు అను పురములు (లోకములు) సృష్టించి వానిలో నుండు వాడు}; ఆఢ్యుఁడు = శ్రీమంతుడు {ఆఢ్యుడు -లక్ష్మీదేవి యనే సంపద గలవాడు, సంపన్నుడు}; ప్రకృతి = ప్రకృతి; కిన్ = కంటెను; పరుఁడు = పై నున్న వాడును; అవ్యయుఁడు = నాశనములేనివాడును; అఖిల = సమస్త; భూత = ప్రాణుల యందు; బహిర్ = బయట; అంతర్ = లోపల; భాసురుఁడును = ప్రకాశించువాడును; లోక = లోకములను; నియంతయున్ = పాలించువాడును; పరమేశ్వరుఁడు = పరమమైన ఈశ్వరుడును; ఐన = అయినట్టి; నీకున్ = నీకు; ప్రణతులు = నమస్కారములు; అగు = చేయుచున్నాము; హరీ = కృష్ణా.
   కృష్ణా! నువ్వు పరమపురుషుడవు, దేవాధిదేవుడువు, ప్రకృతికి అవ్వలివాడవు, అనంతుడవు, సకల ప్రాణులలో వెలుపల లోపల ప్రకాశిస్తూ ఉండేవాడవు. విశాల విశ్వాన్ని నడిపేవాడవు, పరమేశ్వరుడవు అయినట్టి నీకు నమస్కారములు.
(కుంతి స్తుతి, భీష్మ స్తుతి రెండు భాగవతంలోని అద్భుతమైనవి.కుంతి సామాన్యురాలు కాదు. చిన్నతనంలోనే విశ్వామిత్రుడు అంతటి వానిని సేవించి ప్రసన్నుని చేసుకున్నది. పాండురాజు తదనంతరం పాండవులను అయిదుగురిని పెంచి పోషించిన ఘనురాలు)
1-187-kaMda padyamu
puruShuM DaaDhyuM~Du prakRitikiM~
baruM~ DavyayuM~ Dakhilabhoota bahiraMtarbhaa
suruM~Dunu lOkaniyaMtayuM~
paramEshvaruM~Daina neekuM~ braNatulagu haree!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: