10.1-420-కంద పద్యము
సెలగోల పట్టుకొని జల
కలశములో నీడఁ జూచి కలశయుతుండై
“సెలగోలఁ
పాపఁ డొకఁ డిదె
తలచెన్ ననుఁ గొట్ట” ననుచుఁ దల్లికి జెప్పెన్.
చిన్నికన్నయ్య ఒకరోజు
సెలగోల చేతిలో పట్టుకొని, గిన్నెలోని నీళ్ళలోకి చూసాడు. తన ప్రతిబింబం కనబడింది. ఆ
గిన్నెపట్టుకొని తల్లి దగ్గరకు వెళ్ళి “అమ్మా! పాపాయి ఒకడు, ఇదిగో చూడు! సెలగోల పట్టుకొని నన్ను
కొట్టటానికి వస్తున్నాడు” అన్నాడు.
10.1-420-kaMda padyamu
selagOla paTTukoni jala
kalashamulO neeDaM~ joochi kalashayutuMDai
“selagOlaM~ paapaM~ DokaM~ Dide
talachen nanuM~ goTTa” nanuchuM~ dalliki jeppen.
సెలగోల = చెర్నాకోల, కొరడాకర్ర; పట్టుకొని = చేతబట్టి; జల = నీటి; కలశము = బాన; లోన్ = అందు; నీడన్ = ప్రతిబింబమును; చూచి = చూసి; కలశ = కుండలో; యుతుడు = ఉన్నవాడు; ఐ = అయ్యి; సెలగోలన్ = కొరడాకర్రతో; పాపడు = చిన్నపిల్లవాడు; ఒకడు = ఒకానొకడు; ఇదె = ఇదిగో; తలచెన్ = అనుకుంటున్నాడు; ననున్ = నన్ను; కొట్టన్ = కొట్టాలి; అనుచున్ = అనుచు; తల్లి = తల్లి; కిన్ = కి; చెప్పెన్ = చెప్పెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment