1-201-శా.
శ్రీకృష్ణా! యదుభూషణా!
నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ
ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
శ్రీకృష్ణా = కృష్ణా {కృష్ణ - నల్లనివాడు}; యదుభూషణా = కృష్ణా {యదు భూషణుడు - యదు వంశమునకు భూషణము వంటి
వాడు, కృష్ణుడు}; నరసఖా = కృష్ణా {నరసఖుడు - అర్జునునకు సఖుడు, కృష్ణుడు}; శృంగారరత్నాకరా = కృష్ణా {శృంగార రత్నాకరుడు -శృగార రసమునకు సముద్రము వంటివాడు, కృష్ణుడు}; లోకద్రోహినరేంద్రవంశదహనా = కృష్ణా {లోకద్రోహినరేంద్రవంశదహన - దుష్టరాజవంశముల నాశనము చేయువాడు, కృష్ణుడు}; లోకేశ్వరా = కృష్ణా {లోకేశ్వరుడు - లోకములకు ఈశ్వరుడు, కృష్ణుడు}; దేవతానీకగోబ్రాహ్మణార్తి హరణా = కృష్ణా {దేవతానీకగోబ్రాహ్మణార్తి హరణుడు - దేవత = దేవతల, అనీక = సమూహమునకును, బ్రాహ్మణ = బ్రాహ్మణులకును, గోగణ = గోవులమందకును, ఆర్తి = బాధలను, హరణా = హరించువాడు, కృష్ణుడు}; నిర్వాణ సంధాయకా = కృష్ణా {నిర్వాణ సంధాయికుడు - మోక్షమును కలింగించువాడు, కృష్ణుడు}; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరిస్తున్నాను; త్రుంపవే = తెంపుము; భవ = సంసార; లతల్ = బంధనములు; నిత్యానుకంపానిధీ = కృష్ణా {నిత్యానుకంపానిధి -శాశ్వతమైన దయకు నిలయమైనవాడు, కృష్ణుడు}.
శ్రీ కృష్ణా! యదుకులవిభూషణా! అర్జునమిత్రా! శృంగార
రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశాలను దహించే వాడా! జగదీశ్వరా!
ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవులమందల ఆర్తులను బాపువాడా! మోక్షాన్ని ప్రసాదించే
ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకీ ఈ భవబంధాలను
తెంపెయ్యి.
1-201-shaardoola vikreeDitamu
shreekRiShNaa! yadubhooShaNaa! narasakhaa!
shRiMgaararatnaakaraa!
lOkadrOhinarEMdravaMshadahanaa! lOkEshvaraa!
dEvataa
neekabraahmaNagOgaNaartiharaNaa!
nirvaaNasaMdhaayakaa!
neekun mrokkedaM~ druMpavE bhavalatal
nityaanukaMpaanidhee!
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :