Saturday, May 31, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 302

తనువుమనువు
9-121-ఆ.
నువు మనువు విడిచి, నయులఁ జుట్టాల
నాలి విడిచి, సంపదాలి విడిచి,
నన్నకాని యన్య మెన్నఁడు నెఱుఁగని
వారి విడువ నెట్టివారి నైన.
          తమ దేహాన్ని, జీవితాన్ని, భార్యాబిడ్డలను, బాంధువులను, సంపదలను సర్వం వదలి నన్నే నమ్ముకున్న వారిని, నన్ను తప్పించి ఇతర మెరుగని వారిని, ఎలాంటివారైనా సరే నేను ఎన్నడు వదిలిపెట్టను.
అంబరీషుని మీద కృత్యను ప్రయోగించాడు దూర్వాసుడు. సుదర్శన చక్రం కృత్యను హతమార్చి, దూర్వాసుని వెంటబడింది. పోయి ప్రార్థించగా భక్తపరాధీనుడు విష్ణువు ఇలా చెప్తూ పోయి అబరీషుని శరణువేడు, అతను కాపాడతాడు అని చెప్పి పంపాడు.
9-121-aa.
tanuvu manuvu viDichi, tanayula@M juTTaala
naali viDichi, saMpadaali viDichi,
nannakaani yanya menna@MDu neRu@Mgani
vaari viDuva neTTivaari naina.
          తనువున్ = దేహమును; మనువున్ = జీవితాన్ని; విడిచి = వదలి; తనయులన్ = పిల్లలను; చుట్టాలన్ = బంధువులను; ఆలిన్ = భార్యను; విడిచి = వదలివేసి; సంపద = సంపదలు; అలి = అన్నిటిని; విడిచి = వదిలేసి; నన్న = నన్ను మాత్రము; తప్పించి = తప్పించి; అన్యము = ఇతరము; ఎన్నడున్ = ఎప్పుడు; ఎఱుగని = తెలియని; వారిన్ = వారిని; విడువన్ = వదలిపెట్టను; ఎట్టి = ఎలాంటి; వారిన్ = వారు; ఐనన్ = అయి నప్పటికిని.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Friday, May 30, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 301

జలజాతాక్షుడు

1-244-మ.
జాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్రశృంగారకన్
హంసావృత హేమపద్మ పరిఖా కాసారకన్ దోరణా
ళి సంఛాదిత తారకన్ దరులతా ర్గానువేలోదయ
త్ఫపుష్పాంకుర కోరకన్ మణిమయప్రాకారకన్ ద్వారకన్.
          బంగారు కలశాలతో ప్రకాశించే ఎత్తైన మేడలు కలది, కలహంసలతో కాంచనవర్ణ కమలాలతో అలరారే అగడ్తలు చుట్టు కలది, చుక్కలు తాకే చక్కని తోరణాలు, పండ్లు, పువ్వులు, చివుళ్లు, మొగ్గలుతో నిండిన లతాకుంజాలు, పంక్తులు పంక్తులు వృక్షాలు కలది, రత్నఖచిత ప్రాకారాలు కలది అయిన ద్వారకానగరాన్ని కలువరేకుల లాంటి కళ్ళున్న శ్రీకృష్ణుడు సమీపించాడు.
1-244-ma.
jalajaataakshu@MDu Sauri DaggaRe mahaasaudhaagraSRMgaarakan
galahaMsaavRta haemapadma parikhaa kaasaarakan dOraNaa
vaLi saMChaadita taarakan darulataa vargaanuvaelOdaya
tphala pushpaaMkura kOrakan maNimaya praakaarakan dvaarakan.
          జలజాతాక్షుఁడు = కృష్ణుడు {జలజాతాక్షుడు - పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు / కృష్ణుడు}; శౌరి = కృష్ణుడు; డగ్గఱెన్ = సమీపించెను; మహా = పెద్ధ; సౌధ = మేడల; అగ్ర = అగ్ర భాగములచే; శృంగారకన్ = అలంకరింపబడినదైన; కల = మనోహరమైన కంఠద్వని కల; హంస = హంసలచే; ఆవృత = చుట్టబడిన; హేమ = బంగారు రంగు పుప్పొడి కలిగిన; పద్మ = పద్మములతో కూడిన; పరిఖా = కందకములు; కాసారకన్ = కోనేళ్ళు కలదైన; తోరణా = తోరణముల; ఆవళి = సమూహముచే; సంఛాదిత = బాగాకప్పబడిన; తారకన్ = నక్షత్రములు కలదైన; తరు = చెట్ల; లతా = లత; వర్గ = వరుసలు; అనువేల = తీరముననుసరించి; ఉదయత్ = ఉదయించుచున్న; ఫల = పండ్లు; పుష్ప = పుష్పములు; అంకుర = మొలకలు; కోరకన్ = మొగ్గలును కలదైన; మణి = రత్నములు; మయ = తాపిన; ప్రాకారకన్ = ప్రహారీగోడ కలదైన; ద్వారకన్ = ద్వారకా నగరమును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Thursday, May 29, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 300

కనకాగార

1-311-మ.
కాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ ముందటం
ని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నే కాలంబు దుర్లంఘ్యమై
నివార్యస్థితిఁ జంపునట్టి నిరుపాయంబైన కాలంబు వ
చ్చె నుపాంతంబున; మాఱు దీనికి మదిం జింతింపు ధాత్రీశ్వరా!
          ఓరాజా! ప్రపంచంలోని మానవులు బంగారు భవనాలు, పుత్ర, మిత్ర, కళత్ర పరివారాన్ని ఎల్లప్పుడు ఎదురుగుండ చూచుకొంటు, ప్రాణాలమీద తీపిని పెంచుకొంటు ఉంటారు. అయితే దుర్నివారక మైన కాలం వాళ్లను చంపి తీరుతుంది. కాలాన్ని కాదని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. అక్కడ ఏ ఉపాయాలు పనిచేయవు. నీకు అలాంటి కాలం దగ్గరపడింది. మహారాజ! దీనికి ప్రతిక్రియ ఏదైన ఆలోచించండి.
కురుక్షేత్ర యుద్దానంతరం ధర్మరాజు పంచను చేరి రోజులు వెళ్ళదీస్తున్న ధృతరాష్ట్ర్రునికి విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తు ఇలా చెప్పసాగాడు.
1-311-ma.
kanakaagaara kaLatra mitra suta saMghaataMbulan muMdaTaM
gani praaNaechChala nuMDu jaMtuvula nae kaalaMbu durlaMghyamai
yanivaaryasthiti@M jaMpunaTTi nirupaayaMbaina kaalaMbu va
chche nupaaMtaMbuna; maaRu deeniki madiM jiMtiMpu dhaatreeSvaraa!
          కనక = బంగారము; అగార = గృహములు; కళత్ర = భార్యలు; మిత్ర = మిత్రులు; సుత = సంతానముల; సంఘాతంబు లన్ = సమూహములను; ముందటన్ = ఎదురు గుండా; కని = చూసి; ప్రాణ = ప్రాణములమీద; ఇచ్ఛలన్ = మక్కువతో; ఉండు = ఉండు; జంతువులను = జీవులను; = ; కాలంబు = కాలము; దుర్లంఘ్యము = దాటరానిది; = అయ్యి; అనివార్య = నివారింపరలేని; స్థితిన్ = విధముగ; చంపున్ = చంపును; అట్టి = అటువంటి; నిరుపాయంబు = ఉపాయములేనిది; ఐన = అయినట్టి; కాలంబు = కాలము; వచ్చెన్ = వచ్చెను; ఉపాంతంబున = సమీపమునకు; మాఱు = తిరుగు; దీని = దీని; కిన్ = కి; మదిన్ = మనసులో; చింతింపు = ఆలోచించుము; ధాత్రీశ్వరా = రాజా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Tuesday, May 27, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 299

కంఠేకాలునిచేతం

9-615-క. 
కంఠేకాలునిచేతం
గుంఠితుఁడగు టెట్లు మరుఁడు? కుసుమాస్త్రంబుల్
లుంఠించి గుణనినాదము
ఠంమ్మన బాల నేసె వఠవ గదురన్.
          అదిగో మన్మథుడు ఆ పిల్ల మీద అల్లెతాడు ఠంఠమ్మనేలా పూలబాణాలు సంధించి ఠవఠవ మని నాటేలా వేసాడు. కంఠంనల్లగా ఉన్న శంకరుడు మరులురేపే మన్మథుని దహించాడు అంటే ఎలా నమ్మేది.
దుష్యంతుని ప్రధమదర్శనంలో శకుంతల స్థితి వర్ణన యిది.
9-615-ka.
kaMThaekaalunichaetaM
guMThitu@MDagu TeTlu maru@MDu? kusumaastraMbul
luMThiMchi guNaninaadamu
ThaMThammana baala naese ThavaThava gaduran.
          కంఠేకాలుని = పరమశివుని {కంఠేకాలుడు - కంఠము నల్లగానున్నవాడు, శంకరుడు}; చేతన్ = వలన; కుంఠితుడు = దహింపబడిన వాడు; అగుట = ఐ ఉండుట; ఎట్లు = ఎలా అగును, కాదు; మరుడున్ = మన్మథుడు; కుసుమ = పూల; అస్త్రంబుల్ = బాణములను; లుంఠించి = సంధించి; గుణ = అల్లెతాడు; నినాదము = ధ్వని; ఠంఠమ్ము = ఠంకారము; అనన్ = చేయగా; బాలన్ = బాలికపైన; ఏసెన్ = ప్రయోగించెను; ఠవఠవ = టకటకమని; కదురన్ = పడేలాగ .
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~