Saturday, December 20, 2014

రుక్మిణీకల్యాణం – తగునీచక్రి

61- మ.
గు నీ చక్రి విదర్భరాజసుతకుం; థ్యంబు వైదర్భియుం
గు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱం
గులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; ర్పాహతారాతి యై
గఁడౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్య మూలంబునన్.
62- వ.
అని పలికి రా సమయంబున.
          ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు మన విదర్భరాకుమారి రుక్మిణికి తగినవాడు. ఇది సత్యం. ఈమె అతనికి తగినామె. ఈ రుక్మిణీ కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు, ఎంత మంచి జంటో. వీరిద్దరిని కూర్చిన బ్రహ్మదేవుడు కడు సమర్థుడే మరి. మా పుణ్యాల ఫలంగా ఈ వాసుదేవుడు పగవారి పీచమణచి మన రుక్మిణిని పెళ్ళాడు గాక.
          రుక్మిణీ స్వయంవరానికి వచ్చినప్పుడు కృష్ణుని దర్శించుకున్న కుండిన నగర పౌరులు వారిలో వారు ఇలా అనుకున్నారు.
61- ma.
tagu nee chakri vidarbharaajasutakuM; dathyaMbu vaidarbhiyuM
dagu nee chakriki; niMta maMchi dagunE? daaMpatya mee yiddaRraM
dagulaM gaTTina brahma nErparigadaa; darpaahataaraati yai
magaM~DauM~ gaavutaM~ jakri yee ramaNikin maa puNya moolaMbunan.
62- va.
ani paliki raa samayaMbuna.
          తగున్ = సరిపడును; = ఈ యొక్క; చక్రి = కృష్ణుడు; విదర్భ = విదర్భ దేశపు; రాజసుత = రాకుమారి; కున్ = కి; తథ్యంబు = నిజముగా; వైదర్భియున్ = రుక్మిణికూడ; తగున్ = సరిపోవును; = ఈ యొక్క; చక్రి = కృష్ణుని; కిన్ = కి; ఇంత మంచి దగునే = చాలా మంచిది అగును; దాంపత్యము = ఆలుమగలకూడిక; = ; ఇద్దఱన్ = ఇద్దరిని; తగులంగట్టినన్ = కూర్చిన పక్షమున; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; నేర్పరి = మంచి నేర్పుగలవాడు కదా; దర్ప = పరాక్రమముచేత; హత = ఓడింపబడిన; ఆరాతి = శత్రువులు కలవాడు; = అయ్యి; మగడు = భర్త; ఔగావుత = అగునుగాక; చక్రి = కృష్ణుడు; = ; రమణి = ఇంతి; కిన్ = కి; మా = మా యొక్క; పుణ్య = పుణ్యముల; మూలంబునన్ = వలన.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: