Wednesday, December 31, 2014

రుక్మిణీకల్యాణం – అని యొండొరులదెలుపుకొని

74- వ.
అని యొండొరులఁ దెలుపుకొని, రోషంబులు హృదయంబుల నిలుపుకొని, సంరంభించి, తనుత్రాణంబులు వహించి, ధనురాది సాధనంబులు ధరియించి, పంతంబులాడి, తమతమ చతురంగ బలంబులంగూడి, జరాసంధాదులు యదువీరుల వెంటనంటఁ దాఁకి, నిలునిలు మని ధిక్కరించి పలికి, యుక్కుమిగిలి, మహీధరంబుల మీఁద సలిల ధారలు కురియు ధారాధరంబుల చందంబున బాణ వర్షంబులు గురియించిన యాదవసేనలం గల దండనాయకులు కోదండంబు లెక్కిడి, గుణంబులు మ్రోయించి; రప్పుడు.
          అలా కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే, శశిపాలాదులు ఒకరికొకరు హెచ్చరించుకొని, రోషాలు పెంచుకొన్నారు. కవచాలు, బాణాలు, ఆయుధాలు ధరించారు. జరాసంధుడు మొదలైనవారంతా పంతాలేసుకొని తమతమ చతురంగ సైన్యాలతో యాదవుల వెంటబడ్డారు. ఆగక్కడ ఆగక్కడ అని హుంకరించారు. మేఘాలు కొండలమీద కురిపించే వానధారల్లా బాణ వర్షాలు కురిపించారు. యాదవ సేనానాయకులు విల్లులెక్కుపెట్టి, వింటి తాళ్ళు మోగించారు.
          అని = అని; ఒండొరులన్ = ఒకరికొకరు; తెలుపుకొని = చెప్పుకొని; రోషంబులు = పౌరుషములు; హృదయంబులన్ = మనసులలో; నిలుపుకొని = ఉంచుకొని; సంరంభించి = ఆటోపించి; తనుత్రాణంబులున్ = కవచములను; వహించి = ధరించి; ధనుః = ధనుస్సు; ఆది = మొదలగు; సాధనంబులున్ = ఆయుధములు; ధరియించి = ధరించి; పంతంబులు = బింకములు; ఆడి = పలుకుచు; తమతమ = వారివారి; చతురంగబలంబులన్ = చతురంగ సైన్యముల; కూడి = తో కలిసి; జరాసంధ = జరాసంధుడు; ఆదులు = మున్నగువారు; యదు = యాదవ; వీరుల = సైనికుల; వెంటన్ = వెంబడి; అంటదాకి = దరిచేరి; నిలునిలుము = ఆగిపొండి; అని = అని; ధిక్కరించి = గద్దించి; పలికి = కేకలువేసి; ఉక్కుమిగిలి = విజృంభించి; మహీధరంబులన్ = కొండల {మహీధరంబులు - నేలను ధరించునవి, కొండలు}; మీదన్ = పైన; సలిల = నీటి; ధారలు = జల్లులు; కురియు = వర్షించు; ధారాధరంబులు = మేఘముల {ధారాధరంబులు - నీటిధారలను కలిగి ఉండునవి, మేఘములు}; చందంబునన్ = వలె; బాణ = బాణముల; వర్షంబులున్ = వానలను; కురియించినిన్ = కురిపించగా; యాదవ = యాదవుల; సేనలన్ = సైన్యములలో; కల = ఉన్న; దండనాయకులు = సేనానాయకులు; కోదండంబులు = విల్లులను; ఎక్కిడి = ఎక్కపెట్టి; గుణంబులున్ = అల్లెతాడులను; మ్రోయించిరి = టంకారములు చేయించిరి; అప్పుడు = ఆ సమయము నందు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

Tuesday, December 30, 2014

రుక్మిణీకల్యాణం - ఘన సింహంబుల కీర్తి

73- మ.
సింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్
కీర్తుల్ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదం బుతో గోపకుల్
నుచున్నా రదె; శౌర్య మెన్నటికి? మీ స్త్రాస్త ముల్ గాల్పనే?
నుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్.
          గొప్ప గొప్ప సింహాల పరువు నీచమైన జంతువులు తీసేసినట్లు, మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణీ పడతిని పట్టుకు పోతున్నాడు. అదిగో చూడండి, గొల్లలు ఉద్రేకంగా పారిపోతున్నరు. రాకుమారిని విడిపించ లేకపోతే మన పరాక్రమా లెందుకు. మన అస్త్రశస్త్రా లెందుకు దండగ. సందుగొందుల్లో జనాలు నవ్వరా. అని జరాసంధాదులు తమలో తాము హెచ్చరించుకోసాగారు.
73- ma.
ghana siMhaMbula keerti neechamRigamul gaikonna chaMdaMbunan
mana keertul goni baalaM~ dODkonuchu nunmaadaM butO gOpakul
chanuchunnaa rade; shaurya mennaTiki? mee shastraasta mul gaalpanE?
tanumadhyan viDipiMpamEni nagarE dhaatreejanul kraMta lan.
          ఘన = గొప్ప; సింహంబుల = సింహముల యొక్క; కీర్తిన్ = కీర్తిని; నీచ = అల్పమైన; మృగముల్ = జంతువులు; కైకొన్న = తీసుకొన్న; చందంబునన్ = విధముగ; మన = మన యొక్క; కీర్తుల్ = కీర్తులను; కొని = తీసుకొని; బాలన్ = కన్యను; తోడ్కొనుచున్ = కూడతీసుకొని; ఉన్మాదంబు = ఒళ్ళుతెలియనితనము; తోన్ = తోటి; గోపకుల్ = గొల్లవారు; చనుచున్నారు = పోవుచున్నారు; అదె = అదిగో; శౌర్యము = పరాక్రమము; ఎన్నిటికిన్ = ఇకదేనికి; మీ = మీ యొక్క; శస్త్ర = శస్త్రములు; అస్త్రములు = అస్త్రములు; కాల్పనే = దేనికి తగులబెట్టుటకా; తనుమధ్యన్ = యువతిని {తనుమధ్య - తను (సన్నని) మధ్య (నడుము కలామె), స్త్రీ}; విడిపింపమేని = విడిపించకపోయినచో; నగరే = నవ్వరా, ఎగతాళిచేయరా; ధాత్రీ = భూలోక; జనుల్ = ప్రజలు; క్రంతలన్ = వీధులలో.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

Monday, December 29, 2014

రుక్మిణీకల్యాణం - రుక్మిణీ గ్రహణంబు

72- వ.
కని తదీయ రూప వయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి మనోభవశరాక్రాంతయై రథారోహణంబు గోరుచున్న యవ్వరారోహంజూచి, పరిపంథి రాజలోకంబు చూచు చుండ మందగమనంబున గంధసింధురంబు లీలం జనుదెంచి ఫేరవంబుల నడిమిభాగంబుఁ గొని చను కంఠీరవంబు కైవడి నిఖిల భూపాలగణంబుల గణింపక దృణీకరించి రాజకన్యకం దెచ్చి హరి తన రథంబుమీఁద నిడికొని భూనభోంతరాళంబు నిండ శంఖంబు పూరించుచు బలభద్రుండు తోడ నడవ, యాదవ వాహినీ పరివృతుండై ద్వారకానగర మార్గంబు పట్టి చనియె; నంత జరాసంధ వశులైన రాజు లందఱు హరి పరాక్రమంబు విని సహింప నోపక.
          అలా గౌరీపూజ చేసుకొని బయటకు వచ్చిన రుక్మిణి, కృష్ణుని చూసింది. అతని సౌందర్యం, యౌవనం, లావణ్యం, వైభవం, గాంభీర్యం, నేర్పరితనం, తేజస్సుల అతిశయానికి సంతోషించింది. మన్మథ బాణాలకు గురై రథం ఎక్కాలని ఆశ పడుతున్న ఆమెను చూసాడు కృష్ణమూర్తి. సింహం తిన్నగా వచ్చి నక్కల మధ్యన ఉన్న ఆహారాన్ని పట్టుకు పోయినట్లు శత్రుపక్షం రాజులందరు చూస్తుండగా వాళ్ళని లెక్కచేయకుండా రాకుమారిని రథం ఎక్కించుకొని భూమ్యాకాశాలు నిండేలా శంఖం పూరిస్తూ ద్వారక కెళ్ళే దారి పట్టాడు. బలరాముడు యాదవ సైన్యాలు అనుసరిస్తున్నారు. అప్పుడు కృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు.
          కని = చూసి; తదీయ = అతని; రూప = రూపసౌందర్యము; వయః = యౌవనపు; లావణ్య = దేహకాంతి; వైభవ = వైభవములు; గాంభీర్య = గంభీరత; చాతుర్య = నేర్పులు; తేజః = తేజస్సుల; విశేషంబుల్ = విశిష్టతల; కున్ = కు; సంతసించి = సంతోషించి; మనోభవ = మన్మథుని; శరా = బాణములచేత; ఆక్రాంత = ఆక్రమింపబడినామె; = అయ్యి; రథా = రథమును; ఆరోహణంబున్ = ఎక్కుటను; కోరుచున్న = కోరుకుంటున్న; = ఆ యొక్క; వరారోహన్ = సుందరిని {వరారోహ - శ్రేష్ఠమైన పిరుదులు కలామె, స్త్రీ}; చూచి = చూసి; పరిపంథి = శత్రు; రాజ = రాజుల; లోకంబున్ = సమూహము; చూచుచుండన్ = చూస్తుండగా; మంద = మెల్లని; గమనంబునన్ = నడకలతో; గంధ = మద; సింధురంబు = ఏనుగు; లీలన్ = వలె; చనుదెంచి = వచ్చి; ఫేరవంబుల = నక్కల; నడిమి = మధ్యనగల; భాగంబున్ = అమిషఖండమును; కొని = తీసికొని; చను = పోవు; కంఠీరవంబు = సింహము; కైవడిన్ = వలె; నిఖిల = ఎల్ల; భూపాల = రాజుల; గణంబులన్ = సమూహములను; గణింపక = లెక్కజేయక; తృణీకరించి = తృణప్రాయముగా ఎంచి; రాజకన్యకన్ = రాకుమారిని; తెచ్చి = తీసుకొచ్చి; హరి = కృష్ణుడు; తన = అతని యొక్క; రథంబు = రథము; మీదన్ = పై; ఇడుకొని = పెట్టుకొని; భూనభోంతరాళంబు = భూమ్యాకాశమధ్యనంతా; నిండన్ = నిండునట్లు; శంఖంబున్ = శంఖమును; పూరించుచున్ = ఊదుతూ; బలభద్రుండు = బలరాముడు; తోడన్ = వెంట; నడవ = రాగా; యాదవ = యాదవుల; వాహినీ = సేనలచే; పరివృతుండు = చుట్టునున్నవాడు; ఐ = అయ్యి; ద్వారకా = ద్వారకా; నగర = పట్టణము; మార్గంబున్ = దారి; పట్టి = వెంబడి; చనియెన్ = వెళ్ళను; అంత = అప్పుడు; జరాసంధ = జరాసంధునికి; వశులు = లోబడియున్నవారు; ఐన = అయిన; రాజులు = రాజులు; అందఱున్ = ఎల్లరు; హరి = కృష్ణుని; పరాక్రమంబున్ = పరాక్రమ వృత్తాంతము; విని = విని; సహింపన్ = ఓర్వ; ఓపక = చాలక.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

Sunday, December 28, 2014

రుక్మిణీకల్యాణం - కనియెన్ రుక్మిణి

71- మ.
నియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల
గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘ సంకాశదే
హు, నగారాతిగజేంద్రహస్తనిభబాహుం, జక్రిఁ, బీతాం బరున్,
నభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.
          రుక్మిణీదేవి కృష్ణుణ్ణి కనుగొంది. అప్పుడు కృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదళాల్లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము, మేఘం లాంటి శరీరవర్ణం, దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి మెడ కలిగి ఉన్నాడు. పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు. విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వ లోక మనోహరంగా ఉన్నాడు.
71- ma.
kaniyen rukmiNi chaMdramaMDalamukhuM, gaMTheeravEMdraavala
gnu, navaaMbhOjadaLaakShuM~, jaarutaravakShun, mEgha saMkaashadE
hu, nagaaraatigajEMdrahastanibhabaahuM, jakriM~, beetaaM barun,
ghanabhooShaanvituM~ gaMbukaMThu, vijayOtkaMThun jaganmOhanun.
          కనియెన్ = చూసెను; రుక్మిణి = రుక్మిణీదేవి; చంద్రమండల = చంద్రబింబము వంటి; ముఖున్ = ముఖము కలవానిని; కంఠీరవ = సింహ; ఇంద్ర = శ్రేష్ఠము వంటి; అవలగ్నున్ = నడుము కలవానిని; నవ = సరికొత్త; అంభోజ = తామర; దళ = రేకులవంటి; అక్షున్ = కన్నులు కలవానిని; చారుతర = మిక్కిలి అందమైన {చారు - చారుతరము - చారుతమము}; వక్షున్ = వక్షస్థలము కలవానిని; మేఘ = మేఘములను; సంకాశ = పోలిన; దేహున్ = దేహము కలవానిని; నగారాతిగజేంద్ర = ఐరావతము యొక్క {నగారాతిగజేంద్రము - నగ (పర్వతములకు) ఆరాతి (శత్రువు) ఐన ఇంద్రుని గజశ్రేష్ఠము, ఐరావతము}; హస్త = తొండము; నిభ = వంటి; బాహున్ = చేతులు కలవానిని; చక్రిన్ = చక్రాయుధుని, కృష్ణుని; పీతాంబరున్ = పసుపు వన్నె వస్త్రము వాని; ఘన = గొప్ప; భూష = ఆభరణములు; ఆన్వితున్ = కూడినవానిని; కంబు = శంఖము వంటి; కంఠున్ = మెడ కలవానిని; విజయ = జయించుట యందు; ఉత్కంఠున్ = ఉత్కంఠము కలవానిని; జగత్ = లోకములను; మోహనున్ = మోహింపజేయువానిని.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :