10.1-538-ఉ.
బాలురఁ గంటి నాచెయిది బాసినవారిని మున్ను వారి నేఁ
బోలఁగఁ జూచునంతటన భూరినిరర్గళదుర్గమప్రభా
జాలముతోడఁ జూపులకుఁ జాలమిఁ దెచ్చుచు నున్నవార; లే
మూలమొ మార్గమెయ్యదియొ? మోసము వచ్చెఁగదే విధాతకున్.
10.1-539-వ.
అని సకలేంద్రియంబులకు వెక్కసంబైన స్రుక్కి.
భావము:
“నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలురను ముందు నుంచీ చూస్తూనే ఉన్నాను. వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనపడుతున్నారు. ఆ తేజస్సు మహా ప్రవాహం లాగ చూపులతో నైనా సమీపించడానికి వీలుకాకుండా ఉంది. వారి వర్చస్సు చూడడానికి నా చూపులకు శక్తి చాలటం లేదు. దీనికి అంతటికి మూలకారణం ఏమిటి? ఇప్పుడు నేనేమిటి చేయడం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడను నాకే మోసం వచ్చింది కదా.” ఆ బాలుర రూపాలు బ్రహ్మదేవుని ఇంద్రియాల అన్నిటికీ భరించరానివి అయిపోయాయి. చూసి చూసి అతడు చేష్టలు దక్కి డస్సి పోయాడు.
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment