Saturday, November 17, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 49

10.1-528-క.
అని మున్ను ముగ్దుఁ డయ్యును
దన యందుల దివ్యదృష్టిఁ దప్పక బుద్ధిన్
దన చెలికాండ్రను గ్రేపుల
వనజాక్షుం డనుచుఁ జూచె వసుధాధీశా!

భావము:
బలరాముడు ఇలా ఆలోచించి ఇంతవరకూ మోహంచెంది ఉన్నప్పటికీ, ఇప్పుడు దివ్యదృష్టితో శ్రద్ధగా చూసాడు. తన స్నేహితులు లేగదూడలు అన్నీ కృష్ణుడే అని గ్రహించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=72&padyam=528

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: