7-20-మత్తేభ విక్రీడితము
“అలుగం గారణ మేమి విప్రులకు? మున్నా విప్రు లెవ్వారు? ని
శ్చలు లేకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారు లీశాను వ
ర్తులు వైకుంఠపురీనివాసు లన విందున్ వారి కెబ్భంగి నీ
ఖలజన్మంబులు వచ్చె? నారద! వినం గౌతూహలం బయ్యెడిన్.”
“ఓ నారదమునీంద్రా! ఆ వేదమూర్తులైన ఆ విప్రులు ఎవరు? వారికి ఆగ్రహం ఎందుకు వచ్చింది; విష్ణుమందిర
ద్వారపాలకులు ‘నిశ్చలమైన, భక్తి ప్రపత్తులు కలవారు; ఏకాంత దాసుల; ఇంద్రియజయం కలవారు; సంసారబంధాలలో తగుల్కొనని వారు; నిరంతరం జగన్నాథుని ఆజ్ఞను పాటించేవారు; సాక్షాత్తు వైకుంఠంలో నివసించే వారు’. అటువంటి
వాళ్ళు విప్రశాపానికి ఎలా గురయ్యారు? వాళ్ళకి దుష్టజన్మలు
ఎలా కలిగాయి? ఇదంతా వినాలని కుతూహలంగా ఉంది చెప్పండి.”
७-२०-मत्तॅभ विक्रीडितमु
“अलुगं गारण मॅमि विप्रुलकु? मुन्ना विप्रु लेव्वारु? नि
श्चलु लॅकांतुलु निर्जितॅंद्रियुलु निस्संसारु लीशानु
व
र्तुलु वैकुंठपुरीनिवासु लन विंदुन वारि केब्भंगि नी
खलजन्मंबुलु वच्चे? नारद! विनं गौतूहलं बय्येडिन.”
అలుగన్ = కోపించుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; విప్రుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; మున్ను = పూర్వము; ఆ = ఆ; విప్రులు = బ్రాహ్మణులు; ఎవ్వారు = ఎవరు; నిశ్చలులు = చపలతలేనివారు; ఏకాంతులు = అంతరంగభక్తులు; నిర్జితేంద్రియులు = ఇంద్రియములనణచినవారు; నిస్సంసారులు = సంసారబంధములులేనివారు; ఈశానువర్తులు = భగవంతుననుసరించువారు; వైకుంఠ = వైకుంఠము యనెడి; పురీ = పురమునందు; నివాసులు = నివసించెడివారు; అనన్ = అని; విందున్ = విన్నాను; వారి = వారల; కిన్ = కి; ఏ = ఏ; భంగిన్ = లాగున; ఈ = ఇట్టి; ఖల = నీచ; జన్మంబులు = పుట్టుకలు; వచ్చెన్ = కలిగినవి; నారద = నారదుడా; వినన్ = వినవలెనని; కౌతూహలంబు = ఉత్సుకత; అయ్యెడిన్ = కలుగుచున్నది.
: :చదువుకుందాం భాగవతం;
బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment