7-30-శార్దూల విక్రీడితము
నాకుం దమ్ముఁడు మీకు నెచ్చెలి రణన్యాయైకదక్షుండు బా
హాకుంఠీకృతదేవయక్షుఁడు హిరణ్యాక్షుండు వానిన్ మహా
సౌకర్యాంగము దాల్చి దానవవధూసౌకర్యముల్ నీఱుగా
వైకుంఠుండు వధించిపోయెనఁట యీ వార్తాస్థితిన్ వింటిరే.
“ఓ రాక్షసోత్తములారా! ఈ కబురు విన్నారా? వైకుంఠవాసి విష్ణువు
హిరణ్యాక్షుణ్ణి చంపేసాడట. సౌకర్యంగా ఉంటుందని వరాహం రూపుతో వచ్చి ముట్టి కొమ్ముతో
కుమ్మి మరీ చంపేసాడట. అవును సాక్షాత్తు నాకు తమ్ముడు, మీ అందరికి ఆత్మీయ మిత్రుడు
అయిన హిరణ్యాక్షుడు సామాన్యమైన వాడా. యుద్ధ ధర్మం మర్మం బాగా తెలిసిన వాడు. బాహు
బలంతో దేవగణ, యక్షగణాలను నిర్వీర్యులను చేసిన మహా పరాక్రమశాలి. అంతటి వానిని ఆ హరి
సంహరించి అంతఃపురాలలోని రాక్షస కాంతల సౌభాగ్యాలు హరించి పోయాడట.
७-३०-शार्दूल विक्रीडितमु
नाकुं दम्मुँडु मीकु नेच्चेलि रणन्यायैकदक्षुंडु बा
हाकुंठीकृतदॅवयक्षुँडु हिरण्याक्षुंडु वानिन महा
सौकर्यांगमु दाल्चि दानववधूसौकर्यमुल नीर्रुगा
वैकुंठुंडु वधिंचिपॉयेनँट यी वार्तास्थितिन विंटिरॅ.
నా = నా; కున్ = కు; తమ్ముడు = సోదరుడు; మీ = మీరల; కున్ = కు; నెచ్చెలి = ప్రియమిత్రుడు; రణ = యుద్ద; న్యాయ = నీతి; ఏక = సమస్తము నందు; దక్షుండు = సమర్థుడు; బాహా = చేతులచేత; కుంఠీకృత = లోబరుచుకొనబడిన; దేవ = దేవతలు; యక్షుడు = యక్షులు గలవాడు; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; వానిన్ = అతనిని; మహా = గొప్ప; సౌకర్య = (సూకర) వరాహపు; అంగమున్ = దేహమును; తాల్చి = ధరించి; దానవ = రాక్షస; వధూ = వనితల; సౌకర్యముల్ = సౌభాగ్యములు; నీఱుగాన్ = నీరుగారి నశించునట్లు; వైకుంఠుండు = విష్ణుమూర్తి {వైకుంఠుడు - వైకుంఠముననుండు వాడు, విష్ణువు}; వధించిపోయెన్ = చంపివేసినాడు; అటన్ = అట; ఈ = ఇట్టి; వార్తా = వృత్తాంతము; స్థితిన్ = సంభవించుటను; వింటిరే = విన్నారా.
: :చదువుకుందాం భాగవతం;
బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment