Thursday, June 25, 2015

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - వక్రంబింతయులేక

7-25-శార్దూల విక్రీడితము
క్రం బింతయు లేక పాయని మహావైరంబునన్ నిత్యజా
క్రోధస్మరణంబులన్ విదళితోద్యత్పాపసంఘాతులై
క్రచ్ఛిన్నశిరస్కులై మునివచశ్శాపావధిప్రాప్తులై
క్రిం జెందిరి వారు పార్శ్వచరులై సారూప్యభావంబునన్.
          ఈ శిశుపాలుడు, దంతవక్త్రుడు ఇద్దరూ పుట్టుకతోటే కృష్ణునిపై ఎడతెగని ద్వేషం, రోషం, క్రోధం పెట్టుకుంటూ నిత్యం హరిని నిందించేవారు. ప్రతి క్షణం ఆయన్నే తలుస్తూ, వేరే ఆలోచన లేకుండా, ఆయన చుట్టూరా ఊహలన్నీ పెట్టుకొని ఉండేవారు. అలా హరి వాళ్ళ హృదయాలలో నిండి ఉండేవాడు. హరి సుదర్శన చక్రంతో వారి శిరస్సులతోపాటు సమస్త పాపాలను ఖండిచాడు. కనుక వారు సనకాది మునుల శాపం నుండి విముక్తులై, విష్ణు సారూప్యము, విష్ణు సాన్నిధ్యము పొంది, వారి పదవులకు తిరిగి వెళ్ళారు.
७-२५-शार्दूल विक्रीडितमु
वक्रं बिंतयु लॅक पायनि महावैरंबुनन नित्यजा
तक्रॉधस्मरणंबुलन विदळितॉद्यत्पापसंघातुलै
चक्रच्छिन्नशिरस्कुलै मुनिवचश्शापावधिप्राप्तुलै
चक्रिं जेंदिरि वारु पार्श्वचरुलै सारूप्यभावंबुनन.”
            వక్రంబు = కొరత; ఇంతయు = కొంచముకూడ; లేక = లేకుండగ; పాయని = విడువని; మహా = గొప్ప; వైరంబునన్ = పగతో, శత్రుత్వముతో; నిత్య = ఎప్పుడును; జాత = పుట్టెడు; క్రోధ = కోపమువలని; స్మరణంబులన్ = తలంపులతో; విదళిత = పోగొట్టబడిన; ఉద్యత్ = ఎగసిపడెడి; పాప = పాపముల; సంఘాతలు = రాసులుగలవారు; = అయ్యి; చక్ర = విష్ణుచక్రముచేత; ఛిన్న = నరకబడిన; శిరస్కులు = శిరస్సులుగలవారు; = అయ్యి; ముని = మునులచే; వచః = పలుకబడిన; శాప = శాపము; అవధిన్ = చివరలు; ప్రాప్తులు = పొందినవారు; = అయ్యి; చక్రిన్ = నారాయణుని {చక్రి – చక్రాయుధము గలవాడు,విష్ణువు}; చెందిరి = పొందిరి; వారున్ = వారు; పార్శ్వచరులు = అనుచరులు; = అయ్యి; సారూప్య = ఒకేరూపుకలిగెడి; భావంబునన్ = ధర్మమునందు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: