1-202-వ.
అని యిట్లు సకలసంభాషణంబుల నుతియించు గొంతిమాటకు
నియ్యకొని, గోవిందుండు మాయా
నిరూఢ మందహాస
విశేషంబున మోహంబు నొందించి రథారూఢుండై కరినగరంబునకు వచ్చి కుంతీసుభద్రాదుల
వీడ్కొని, తన పురంబునకు విచ్చేయ
గమకించి, ధర్మరాజుచేఁ గించిత్కాలంబు
నిలువు మని ప్రార్థితుండై, నిలిచె; నంత
బంధువధశోకాతురుం డయిన ధర్మజుండు నారాయణ వ్యాస ధౌమ్యాదులచేతఁ దెలుపంబడియుఁ దెలియక మోహితుండై నిర్వివేకం బగు
చిత్తంబున నిట్లనియె.
అని = అని; ఇట్లు = ఈ
విధంగా; సకల = సమస్త; సంభాషణంబులన్ = పదముల; నుతియించు = కీర్తించు; గొంతి = కుంతీదేవి; మాట = మాటలు; కున్ = కి; ఇయ్యకొని = అంగీకరించి; గోవిందుండు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు (స్వామి) / కృష్ణుడు}; మాయా = మాయను; నిరూఢ = నెలకొల్పే; మందహాస = చిరునవ్వు; విశేషంబున = విశిష్టతవలన; మోహంబున్ = మోహమును; ఒందించి = కలిగించి; రథా = రథమును; ఆరూఢుండు = అధిష్టించినవాడు; ఐ = అయ్యి; కరినగరంబు = హస్తినాపురము; కున్ = కు; వచ్చి = వచ్చి; కుంతీ =
కుంతియొక్క; సుభద్ర =
సుభద్ర; ఆదుల =
మొదలగువారి యొక్క; వీడ్కొని = వీడ్కోలు తీసుకొని; తన = తన యొక్క; పురంబు = నగరాని; కున్ = కి; విచ్చేయ = వెళ్ళవలెనని; గమకించి = సంకల్పించి; ధర్మరాజు = ధర్మరాజు; చేన్ = చేత; కించిత్ = కొంచెము; కాలంబు = కాలము; నిలువుము = ఆగుము; అని = అని; ప్రార్థితుండు = వేడుకొనబడినవాడు; ఐ = అయి; నిలిచెన్ = ఆగెను; అంతన్ = అంతట; బంధు = బంధువులను; వధ = వధించిన; శోక = బాధతో; ఆతురుండు = వేదనపడుతున్నవాడు; అయిన = అయినట్టి; ధర్మజుండు = ధర్మరాజు; నారాయణ = కృష్ణుడు {నారాయణుడు - నారముల యందు నివశించువాడు, విష్ణువు}; వ్యాస = వ్యాసుడు; ధౌమ్య = ధౌమ్యుడు; ఆదులు = మొదలగువారి; చేతన్ = చేత; తెలుపంబడియున్ = తెలియజేయబడి నప్పటికీ; తెలియక = సమాధానపడలేక; మోహితుండు = మోహము చెందినవాడు; ఐ = అయి; నిర్వివేకంబు = వివేకశూన్యంము; అగు = అయిన; చిత్తంబునన్ = మనసుతో; ఇట్లు = ఈ విధంగా; అనియెన్ = పలికెను.
ఈ విధంగా కుంతీదేవి మధురోక్తులతో మాధవుణ్ణి
కొనియాడింది. ఆమె ప్రార్థనను అంగీకరించిన శ్రీకృష్ణుడు మాయా మయమైన
తన మధుర మందహాసంతో మైమరపించాడు; రథారూఢుడై హస్తినాపురానికి తిరిగివచ్చాడు. కొంతకాలమైన
తరువాత కుంతి, సుభద్ర మొదలగువారికి చెప్పి ద్వారకానగరానికి
ప్రయాణమైనాడు గోవిందుడు; కొద్దికాలం ఉండమని ధర్మరాజు బతిమిలాడటంతో ఉండిపోయాడు; చుట్టాలందరినీ
మట్టు పెట్టానన్న దుఃఖంతో తల్లడిల్లుతున్న ధర్మజుణ్ణి
కృష్ణుడు, వాయసుడు, ధౌమ్యుడు మొదలైనవారు ఎన్నో విధాల
ఓదార్చారు; అయినా, ఆయన మనస్సు ఊరట చెందలేదు; వ్యాకులమైన హృదయంతో
ధర్మరాజు ఇలా అనుకోసాగాడు.
1-202-va.
ani yiTlu
sakalasaMbhaaShaNaMbula nutiyiMchu goMtimaaTaku niyyakoni, gOviMduMDu maayaa
nirooDha maMdahaasa vishEShaMbuna mOhaMbu noMdiMchi rathaarooDhuMDai
karinagaraMbunaku vachchi kuMteesubhadraadula veeDkoni, tana puraMbunaku
vichchEya gamakiMchi, dharmaraajuchEM~ giMchitkaalaMbu niluvu mani
praarthituMDai, niliche; naMta baMdhuvadhashOkaaturuM Dayina dharmajuMDu
naaraayaNa vyaasa dhaumyaadulachEtaM~ delupaMbaDiyuM~ deliyaka mOhituMDai
nirvivEkaM bagu chittaMbuna niTlaniye.
: :చదువుకుందాం భాగవతం;
బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment