7-28-కంద పద్యము
పరిభూతవ్యధనంబులు,
నిరుపమసంసారజలధినిర్మథనంబుల్
నరకేసరికథనంబులు,
పరిరక్షిత దేవయక్షఫణిమిథునంబుల్.
విష్ణుమూర్తి
యొక్క నారసింహావతార కథలు వ్యథలు పోగొట్టేవి, సుధలు కురిపించేవి, అనంత సంసార
సాగరాన్ని దాటింపజేసేవి. దేవతలు, యక్షులు, పక్షులు మున్నగు దాంపత్య జీవితం కలిగిన
జాతులు అన్నిటికి క్షేమములు కలిగించేవి.
७-२८-कंद पद्यमु
परिभूत व्यधनंबुलु,
निरुपम संसार जलधि निर्मथनंबुल
नरकॅसरि कथनंबुलु,
परिरक्षित दॅव यक्ष फणि मिथुनंबुल.
పరిభూత = పూర్తిగా
పోగొట్టబడిన; వ్యధనంబులు = బాధలు గలవి; నిరుపమ = సాటి లేని; సంసార = సంసారము అనెడి; జలధిన్ = సాగరమును; నిర్మథనంబులు = మిక్కిలి మథించెడివి; నరకేసరి = నరసింహుని; కథనంబులు = చారిత్రములు; పరిరక్షిత = చక్కగా రక్షింపబడిన; దేవ = దేవతల; యక్ష = యక్షుల; ఫణి = నాగుల; మిథునంబుల్ = దంపతులు గలవి.
: :చదువుకుందాం భాగవతం;
బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment