1-203-మ.
"తనదేహంబునకై యనేకమృగసంతానంబుఁ జంపించు దు
ర్జనుభంగిం గురు బాలక
ద్విజ తనూజ భ్రాతృ సంఘంబు
ని
ట్లనిఁ జంపించిన
పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు హా
యన లక్షావధి నైన
ఘోరనరకవ్యాసంగముల్ మానునే?
తన = తన యొక్క; దేహంబు = దేహ పోషణాదులు; కై = కోసం; అనేక = అనేకమైన; మృగ = మృగముల; సంతానంబున్ = సమూహమును; చంపించు = సంహరించు; దుర్జను = చెడ్డవాని; భంగిన్ = వలె; గురు = గురువుల; బాలక = పిల్లల; ద్విజ = బ్రాహ్మణుల; తనూజ = పుత్రుల; భ్రాతృ = సోదరుల; సంఘంబున్ = సమూహములను; ఇట్లు = ఈ విధంగా; అనిన్ = యుద్ధములో; చంపించిన = చనిపోవునట్లు చేసిన; పాప = పాపం; కర్ముడు = చేసినవాడి; కున్ = కి; రాజ్య = రాజ్యముమీద; ఆకాంక్షి = బలీయమైన కోరికతో వేగువాడి; కిన్ = కి; నాకు = నాకు; హాయన = సంవత్సరములు; లక్ష = లక్షలకొలది; అవధి = మేర; ఐనన్ = జరుగునట్టి; ఘోర = ఘోరమైన; నరక = నరకమువలన; వ్యాసంగముల్ = సంబంధములు / వసించుటలు; మానునే = తప్పునే (తప్పవు).
అమాయకమైన మృగాలను ఎన్నింటినో తన శరీరపోషణకోసం అని
చంపించే దుర్మార్గుడిలా, రాజ్యంకోసం అని గురువులను, బాలకులను, బ్రహ్మణులను, కొడుకులను, అన్నదమ్ములను
యుద్ధరంగంలో చంపించాను. ఇంతటి పాపానికి ఒడిగట్టిన నేను లక్షల సంవత్సరాల
పర్యంతం ఘోరమైన నరకం అనుభవించక తప్పదు కదా.
1-203-ma.
"tanadEhaMbunakai
yanEkamRigasaMtaanaMbuM~ jaMpiMchu du
rjanubhaMgiM
guru baalaka dvija tanooja bhraatRi saMghaMbu ni
TlaniM~
jaMpiMchina paapakarmunaku raajyaakaaMkShikin naaku haa
yana
lakShaavadhi naina ghOranarakavyaasaMgamul maanunE?
: :చదువుకుందాం భాగవతం;
బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment