Thursday, September 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – శ్రీకర

10.2-1-.
శ్రీ! పరిశోషిత
త్నా! కమనీయగుణగణాకర! కారు
ణ్యా! భీకరశర ధా
రాకంపితదానవేంద్ర! రామనరేంద్రా!
            శ్రీరామచంద్రప్రభు! సకల సంపదలను కలుగజేసేవాడ! సముద్రాన్ని ఇంకింప జేసిన మహాశక్తిశాలి! మనోహరమైన గుణగణాలకు నిలయమా! దయాసాగరా! భయంకర మైన బాణపరంపరలతో రాక్షసులను కంపింపజేసిన వాడ! నీకు వందనములు.
            దశమస్కంధ ఉత్తరభాగం ఆరంభంలోని ప్రార్థన పద్యమిది.
10.2-1-ka.
Sreekara! pariSOshita ra
tnaakara! kamaneeyaguNagaNaakara! kaaru
Nyaakara! bheekaraSara dhaa
raakaMpitadaanavaeMdra! raamanaraeMdraa!
            శ్రీకర = శ్రీరామ {శ్రీకరుడు - శ్రీ (సంపదలను) కరుడు (కలుగజేయు వాడు), రాముడు}; పరిశోషిత రత్నాకర = శ్రీరామ {పరిశోషిత రత్నాకరుడు - పరిశోషిత (ఇంకిపోవునట్లు చేసిన) రత్నాకరుడు (సముద్రుడు కలవాడు), రాముడు}; కమనీయ గుణగ ణాకర = శ్రీరామ {కమనీయగుణగణాకరుడు - కమనీయ (మనోజ్ఞములైన) గుణగణ (గుణముల సమూహము) లకు ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; కారుణ్యాకర = శ్రీరామ {కారు ణ్యాకరుడు - కారుణ్య (దయ)కి ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; భీకర శరధారాకంపిత దానవేంద్ర = శ్రీరామ {భీకరశరధారాకంపితదానవేంద్రుడు - భీకర (భయంకరమైన) శర (బాణముల) దారా (పరంపరలచే) కంపిత (వణికింపబడిన) దానవేంద్రుడు (రాక్షస ప్రభువులు కలవాడు), రాముడు}; రామనరేంద్రా = శ్రీరామ {రామనరేంద్రుడు - రాముడు అనెడి నరేంద్రుడు (రాజు), రాముడు}.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: