శ్రీ సీతాపతి! లంకే
శాసురసంహారచతుర! శాశ్వత! నుతవా
ణీసత్యధిభూభవవృ
త్రాసురరిపుదేవజాల! రామనృపాలా!
శ్రీ జానకీవల్లభ! రావణాసురుని సంహరించిన చతురుడ! శాశ్వతుడ! బ్రహ్మ. మహేశ్వర, ఇంద్రాది సర్వ దేవతా సమూహములచే స్తుతింపబడువాడ! ఓ రామరాజా! అవధరింపుము.
ఇది ఏకాదశ స్కంధారంభ ప్రార్థన.
11-1-ka.
Sree seetaapati! laMkae
SaasurasaMhaarachatura! SaaSvata! nutavaa
NeesatyadhibhoobhavavR
traasuraripudaevajaala! raamanRpaalaa!
శ్రీ = శోభనకరమైన; సీతాపతి = రామా {సీతాపతి - జానకీ వల్లభుడు, రాముడు}; లంకేశాసుర సంహార చతుర = రామా {లంకేశాసుర సంహార చతురుడు - లంకేశ్వరుని (రావణాసురుని) సంహరించుటలో చతురుడు, రాముడు}; శాశ్వత = రామా {శాశ్వతుడు – శాశ్వతము గా నుండు వాడు, రాముడు}; నుత వాణీసత్యధిభూ భవ వృత్రాసురరిపు దేవజాల = రామా {నుత వాణీసత్యధిభూ భవ వృత్రాసురరిపు దేవజాల -నుత (పొగడబడుతున్న వాణీసత్యధిభూ (బ్రహ్మ) భవ (మహేశ్వరుడు) వృత్రాసురరిపు (ఇంద్రుడు) దేవజాల (మున్నగుదేవతల సమూహము) కలవాడు, రాముడు}; రామనృపాలా = రామా {రామనృపాలుడు - రాముడు అను రాజు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment