Monday, September 8, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 406

వరవైకుంఠపురము

3-513-మ.
వైకుంఠపురము సారసాకరము దివ్య స్వర్ణ శాలాంక గో
పు హర్మ్యావృత మైన త ద్భవన మంభోజంబు త న్మంది రాం
విభ్రాజిత భోగి గర్ణిక త దుద్య ద్భోగ పర్యంకమం
ది వొందన్ వసియించు మాధవుఁడు దా నేపారు భృం గాకృతిన్.
          లోకోత్తరమైన వైకుంఠపురమే ఒక సరస్సు వలె నెలకొని వుంది. దివ్యత్వం దీపించే బంగారు మంటపాలతో, గోపురాలతో, మేడలతో, కూడిన ఆ మహాసౌధమే ఆ సరోవరం నడుమ ఉన్న పద్మం. ఆ మందిరం మధ్య భాగాన ప్రకాశిస్తున్న ఆదిశేషుడే తామరబొడ్డు. ఆ శేషతల్పశాయి శ్రీమహావిష్ణువే తుమ్మెద.
మిక్కిలి ప్రసిద్ధమైన ఆణిముత్యం ఈ పద్యం. వరవైకుంఠపురము అనగానే ఈ పద్యాన్ని గుర్తుచేసుకోలేని తెలుగువాళ్ళలో పండితులు కాని పామరులు కాని ఎవరు ఉండేవారు కాదు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నలుగురు చతుర్ముఖుని పుత్రులు. వారు పరమ బ్రహ్మవేత్తలు, ఆది ఋషులు, దేవర్షులు. వారు ఒకసారి నారాయణుని దర్శించుకోడానికి వెళ్ళారు. ఆ సందర్భంలోని వైకుంఠపుర వర్ణన యిది.
3-513-ma.
vara vaikuMThapuramu saarasaakaramu divya svarNa SaalaaMka gO
pura harmyaavRta maina ta dbhavana maMbhOjaMbu ta nmaMdi raaM
tara vibhraajita bhOgi garNika ta dudya dbhOga paryaMkamaM
dira voMdan vasiyiMchu maadhavu@MDu daa naepaaru bhRM gaakRtin.
          వర = శ్రేష్ట మైన; వైకుంఠ = వైకుంఠము అను; పురము = నగరము; సారస = సరసులకు; ఆకరము = నెలవైనది; దివ్య = మహిమాన్విత మైన; స్వర్ణ = బంగారపు; శాలన్ = శాలల; అంక = గోడలు; గోపుర = గోపురములు; హర్మ్య = మేడలు; ఆవృతము = ఆవరింపబడినది; ఐన = అయినట్టి; తత్ = ; భవనము = మందిరము; అంభోజంబున్ = పద్మము; తత్ = ; మందిర = మందిరము యొక్క; అంతర = లోపల; విభ్రాజిత = విలసిల్లుతున్న; భోగి = ఆదిశేషుడు {భోగి - సర్పము హరి నివాసమున శయ్యగా ఉండునది, ఆదిశేషుడు}; కర్ణిక = పద్మము యొక్క బొడ్డు; తత్ = ; ఉద్యత్ = ఎత్తిన; భోగ = పడగలు కల; పర్యంకము = శయన తల్పము; అందున్ = దానిపై; ఇరవొందన్ = నెలకొని; వసియించు = ఉండు; మాధవుడు = విష్ణుమూర్తి; తాన్ = అతను; ఏపారున్ = అతిశయించును; భృంగ = తుమ్మెద; ఆకృతిన్ = వలె.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: