Sunday, September 21, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – జలాజాంతస్థ్సిత

 
 10.1-495-.
జాంతస్థ్సిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే
కు చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్
శిలుం బల్లవముల్ దృణంబులు లతల్చిక్కంబులుం బువ్వులా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా!
            ఓ పరీక్షిన్మహారాజా! తామర పువ్వు బొడ్డు చుట్టూరా వరుసలు వరుసలుగా రేకులు పరచుకొని ఉంటాయి. అలాగే చల్దులు తినడానికి కృష్ణుడు మధ్యన కూర్చున్నాడు. గోపకలు అందరు చూట్టూరా చేరి కూర్చుని కృష్ణుణ్ణే చూస్తున్నారు. వాళ్ళకి వేరే కంచాలు లేవు. రాతిపలకలు, తామరాకులు, వెడల్పైన గడ్డిపోచలుతోను లతలుతోను పొడుగాటి పొన్న పూలతోను అల్లిన చదరలు, తెచ్చుకున్న చిక్కాలు, వెడల్పైన ఆకులు వీటినే కంచాలుగా వాడుకుంటు అందరు చక్కగా చల్దులు ఆరగించారు.
10.1-495-ma.
jalajaaMtasthita karNikaM dirigiraa saMghaMbulai yunna Rae
kula chaMdaMbuna@M gRshNuniM dirigiraa@M goorchuMDi veekshiMchuchun
SilaluM ballavamu ldRNaMbulu latalchichikkaMbuluM buvvu laa
kulu kaMchaMbulugaa bhujiMchi rachaTan gOpaarbhakul bhoovaraa!
            జలజ = పద్మము; అంతస్థిత = అందలి; కర్ణికన్ = బొడ్డును; తిరిగిరాన్ = చుట్టూరా; సంఘంబులు = కలిసిగట్టుగా నుండెడివి; = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఱేకుల = దళముల; చందంబునన్ = వలె; కృష్ణునిన్ = కృష్ణుడి; తిరిగిరాన్ = చుట్టూరా; కూర్చుండి = కూర్చొని; వీక్షించుచున్ = చూచుచు; శిలలున్ = రాళ్ళు; పల్లవముల్ = చిగుళ్ళు; తృణముల్ = గడ్డిపోచలు; లతల్ = లతలు; చిక్కంబులున్ = సంచులు; పువ్వులున్ = పువ్వులు; ఆకులున్ = ఆకులు; కంచంబులు = తినుటకైన పళ్ళములు; కాన్ = అగునట్లుగా; భుజించిరి = తింటిరి; అచటన్ = అక్కడ; గోప = గొల్లల; అర్భకుల్ = పిల్లలు; భూవరా = రాజా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: