Tuesday, September 9, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 407 - దూర్వాంకురంబుల

4-254-సీ.
దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము;
 లజంబులను జారులజనయనుఁ
దులసీ దళంబులఁ దులసికా దాముని;
 మాల్యంబులను సునైర్మల్య చరితుఁ
త్రంబులను బక్షిత్రునిఁ గడు వన్య;
 మూలంబులను నాది మూలఘనుని
నంచిత భూర్జత్వగాది నిర్మిత వివి;
 దాంబరంబులను పీతాంబరధరుఁ
తే.
నరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత
రూపముల యందుఁ గాని నిరూఢమైన
లిలముల యందుఁ గాని సుస్థలము లందుఁ
గాని పూజింపవలయు నక్కమలనాభు.
          నవనవలాడుతున్న గరికపోచల వలె శ్యామలవర్ణం గల వాసుదేవుణ్ణి గరికపోచలతో పూజించాలి; పద్మాలవంటి కన్నులుగల పరమాత్మను పద్మాలతో పూజించాలి; తులసిదామములు ధరించు దామోదరుని తులసీ దళాలతో పూజించాలి; మాలిన్యం లేని శీలంగల మహనీయుని మంచి పూల మాలలతో పూజించాలి; ఖగరాజగమనుణ్ణి చిగురుటాకులతో పూజించాలి; సమస్త లోకాలకి మూలమైనట్టి మూలపురుషుని వనమూలికలతో పూజించాలి; పచ్చని పట్టుబట్టలు ధరించే పరమేశుని బూరుగు పట్టతో నేసిన నారబట్టలతో పూజించాలి; ఆ సృష్టికర్త ఆవిర్భావ స్థాన మైన పద్మము నాభి యందు గల నారాయణుని మృణ్మయ, శిలామయ, దారుమయ, ప్రతిమలలో గాని నిర్మల జలాలలో గాని పవిత్రజలాలలో గాని ఆరాధించాలి.
    ఓం నమో భగవతే వాసుదేవాయః అనే ద్వాదశాక్షరీ మంత్రోపాసన విధానం నారదమునీశ్వరుడు పంచాబ్దముల ధృవునికి ఉపదేశిస్తున్నాడు. అతి శక్తివంతమైన తిరుగులేని మహా మంత్రపూరిత ఘట్టమిది.
4-254-see.
doorvaaMkuraMbula doorvaaMkuraSyaamu;
jalajaMbulanu jaaru jalajanayanu@M
dulasee daLaMbula@M dulasikaa daamuni;
maalyaMbulanu sunairmalya charitu@M
batraMbulanu bakshipatruni@M gaDu vanya;
moolaMbulanu naadi moolaghanuni
naMchita bhoorjatvagaadi nirmita vivi;
dhaaMbaraMbulanu peetaaMbaradharu@M
tae.
danaru bhaktini mRchChilaadaaru rachita
roopamula yaMdu@M gaani nirooDhamaina
salilamula yaMdu@M gaani susthalamu laMdu@M
gaani poojiMpavalayu na kkamalanaabhu.
     దూర్వార = గఱిక అనెడి గడ్డి; అంకురంబులన్ = లేత చివుళ్ళతో; దూర్వారాంకుర శ్యాము = లేతగఱిక వలె నవనవలాడు శ్యాముని; జలజంబులను = పద్మములతో; చారు = అందమైన; జలజ నయనున్ = పద్మములవంటి కన్నులు కలవాని; తులసీ దళంబులన్ = తులసి దళములతో; తులసీకా దామునిన్ = తులసిమాల ధరించినవాని; మాల్యంబులన్ = మాలలతో; సు = మంచి; నైర్మల్య = నిర్మలమైన; చరితున్ = వర్తన కలవానిని; పత్రంబులన్ = ఆకులతో; పక్షి = గరుత్మంతుని; పత్రుని = రెక్కల కలవానిని; కడు = అనేక మైన; వన్య = అడవి; = మూలంబులను = మూలికలతో; ఆదిమూల ఘనుని = సృష్టికి మొదటి దుంప వంటి వానిని; అంచిత = చక్కటి; భూర్జ = బూరుగు దూది; త్వక్ = బట్ట; ఆది = మొదలైన వానిచే; నిర్మిత = చేయబడిన; వివిధ = రకరకముల; అంబరములను = వస్త్రముల చేత; పీతాంబర ధరునిన్ = విష్ణుమూర్తిని; తనరు = అతిశయించిన; భక్తిని = భక్తితో; మృత్ = మట్టి; శిలా = శిల; దారు = కర్ర; రచిత = చేయబడిన; రూపములన్ = బొమ్మలు; అందు = వలన; కాని = కాని; నిరూఢ మైన = ప్రసిద్ధ మైన; సలిలముల = జలముల; అందు = లో; కాని = కాని; సుస్థలముల = మంచి ప్రదేశముల; అందు = లో; కాని = కాని; పూజింపవలయున్ = పూజించవలెను; = ; కమలనాభున్ = విష్ణుమూర్తిని {కమలనాభుడు - పద్మము నాభి యందు కలవాడు, విష్ణువు}.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: