హరిచరణాంబుజ
5.1-5-క.
ద రసావేశిత మనః ప్రధానుం డగు స
త్పురుషుఁ డొకవేళ విఘ్నముఁ
బొరసినఁ దన పూర్వ మార్గమును విడువఁ డిలన్.
ఓ పరీక్షిన్మహారాజ! విష్ణుమూర్తి పాదపద్మాల మకరంద రసాస్వాదనలో లీనమై పరవశించే మనసు కలిగిన మంచి మానషికి, ఏకారణం చేత నైనా ఆటంకాలు అడ్డుతగిలినప్పటికి తన పూర్వ మార్గాన్ని సుతారము వదలిపెట్టడు.
మానవుడు ప్రియవ్రతునిలా గృహస్తాశ్రమంలో ఉంటూ విరక్తిమార్గంలో పయనించగలడు మోక్షం పొందగలడు అని అడుగగా శుకబ్రహ్మ ఇలా వివరణ ప్రారంభించారు.
5.1-5-ka.
hari charaNaaMbuja makaraM
da rasaaveeSita manaH pradhaanuM Dagu sa
tpurushu@M DokaveeLa vighnamu@M
borasina@M dana puurva maargamunu viDuva@M Dilan.
హరి = విష్ణుమూర్తి; చరణ = పాదములు యనెడి; అంబుజ = పద్మముల; మకరంద = మకరందపు; రస = రుచి; ఆవేశిత = ఆవేశించిన; మనః = మనసే; ప్రధానుండు = ముఖ్యముగా కలవాడు; అగు = అయిన; సత్ = మంచి; పురుషుడు = మానవుడు; ఒకవేళ = ఏ కారణముచేత నైన; విఘ్నమున్ = ఆటంకమును; పొరసినన్ = పొందినను; తన = తన యొక్క; పూర్వ = మొదటి; మార్గమును = మార్గమును; విడువడు = వదలడు; ఇలన్ = భూమిపైన.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment