Thursday, September 4, 2014

తెలుగు భాగవత తేనె సోనలు –402

ఇచ్చెలువజూచి

10.1-317-క. 
ఇ చ్చెలువఁ జూచి మ్రుచ్చిలి 
యచ్చుగ నుఱికించుకొనుచు నరిగెద; నాతో 
వచ్చెదవా? యని యనినాఁ 
డి చ్చిఱుతఁడు; సుదతి! చిత్ర మిట్టిది గలదే? 
ఈ చక్కటామెను “దొంగతనంగా లేవదీసుకుపోతాను, నాతో వచ్చేస్తావా” అని అడిగాడట మీ చిన్నాడు. విన్నావా యశోదమ్మ తల్లీ! ఇలాంటి విచిత్రం ఎక్కడైనా చూసామా చెప్పు. 
ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను గోపికలు ఓపికలు లేక యశోదాదేవికి చెప్పుకుంటున్నారు.  
10.1-317-ka. 
i chcheluva@M joochi mruchchili 
yachchuga nuRikiMchukonuchu narigeda; naatO 
vachchedavaa? yani yaninaa@M 
Di chchiRuta@MDu; sudati! chitra miTTidi galadae? 
ఈ = ఈ; చెలువన్ = అందగత్తెను; చూచి = చూసి; మ్రుచ్చిలి = దొంగతనముగ; అచ్చుగన్ = చక్కగా; ఉఱికించుకొనుచున్ = లేపుకొని; అరిగెదన్ = పోయెదను; నా = నా; తోన్ = తోటి; వచ్చెదవా = వస్తావా; అని = అని; అనినాడు = అన్నాడు; ఈ = ఈ; చిఱుతడు = చిన్నవాడు; సుదతి = సుందరి {సుదతి - మంచి దంతములు కలామె, స్త్రీ}; చిత్రము = విచిత్రము; ఇట్టిది = ఇలాంటిది; కలదే = ఎక్కడైనా ఉందా, లేదు. 
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~ 

No comments: