1-255-ఆ.
అంధకారవైరి యపరాద్రి కవ్వలఁ
జనిన నంధ మయిన జగము భంగి
నిన్నుఁ గానకున్న నీరజలోచన!
యంధతమస మతుల మగుదు మయ్య.
శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి ద్వారకానగరానికి తిరిగి
వచ్చాడు. ఆత్మీయ పౌరులు స్వాగతిస్తూ పలుకుతున్నారు – సూర్యభగవానుడు పశ్చిమ
పర్వతం చాటుకు పోయి నప్పుడు జగత్తు అంతా అంధకార బంధుర మైనట్లు నీవు కానరాకుంటే,
మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టాడు తుంటాము.
1-255-aa.
aMdhakaaravairi
yaparaadri kavvala@M
janina naMdha mayina jagamu bhaMgi
ninnu@M
gaanakunna neerajalOchana!
yaMdhatamasa
matula magudu mayya.
అంధకారవైరి = సూర్యుడు {అంధకార
వైరి - చీకటికి
శత్రువు, సూర్యుడు}; అపర = పడమటి; అద్రి = కొండ; కిన్ = కు; అవ్వలన్ = ఆవతల పక్కకి; చనినన్ = వెళ్ళగా; అంధము = చీకటిగా; అయిన = అయి నట్టి; జగము = లోకము; భంగిన్ = వలె; నిన్నున్ = నిన్ను; కానక = చూడగా లేకుండగ; ఉన్న = ఉన్న యెడల; నీరజలోచన = కృష్ణ {నీరజ
లోచన - (నీటిలో
పుట్టినది) పద్మము
వంటి కన్నుల ఉన్న వాడు}; అంధతమస = చీకటి వంటి అజ్ఞానముతో కూడిన; మతులము = బుద్ది కల వారము; అగుదుము = అవుతాము; అయ్య = తండ్రీ.
~~~|సర్వేజనాః
సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment