మన హైందవ చరిత్రలో బహు శ్రేష్ఠ మైనవి సూర్య,
చంద్ర వంశాలు. సూర్యవంశం అంటే శ్రీరాముడు గుర్తుకొస్తాడు. అదే చంద్ర వంశం అంటే
మహాభారత దృష్టిలో పాండవులు, మహాభాగవత దృష్టిలో పరీక్షిత్తు, రెండింటి దృష్టిలోను
కృష్ణుడు గుర్తుకొస్తారు. ఒక మారు
శ్రీకృష్ణ పరంగా చంద్ర వంశ మహా పురుషులను తలచుకుందాం. - నవమ స్కంధము
చంద్ర వంశం
శ్రీకృష్ణుని పితృ తరాలు
(53) జగన్నాథుడు
– నాభి కమలము – (52) బ్రహ్మ – (51) అత్రి –
(50) చంద్రుడు - (49) బుధుడు (బృహస్పతి
భార్య తార అందు) ~ (48) ఇళాకన్య (మనువు శ్రాద్దదేవుడు ~ శ్రద్ద సంతానం) – (47) పురూరవుడు ~ ఊర్వశి – (46) 1 ఆయువు
(45) 1-1 నహుషుడు – యయాతి ~ 1 దేవయాని, 2శర్మిష్ఠ
యదు వంశం
(42) 2 క్రోష్ణువు –(41) వృజినవంతుడు –
(40) శ్వాహితుడు – (39) భేరుశేకుడు – (38) చిత్రరథుడు -(37) శశిబిందుడు – (36)
పదివేల పుత్రులలో ముఖ్యుడు పృథుశ్రవుడు – (35) ధర్మజుడు – (34) ఉశనుడు – (33)
రుచికుడు -
(32) 5 జ్యాముఖుడు ~ శైబ్య – (31) విదర్భుడు –
(30) 2 కృథుడు – (29) కుంతి – (28) దృష్టి
– (27) నిర్వృతి – (26) దశార్హుడు – (25) వ్యోముడు –(24) జీమూతుడు – (23) వికృతి –
(22) భీమరథుడు – (21) నవరథుడు – (20) దశరథుడు – (19) శకుని – (18) కుంతి – (17) దేవరాతుడు – (16) దేవక్షత్రుడు – (15) మధువు – (14)
కురువశుడు – (13) అనువు – (12) పురుహోత్రుడు – (11) అంశువు – (10) సాత్వతుడు –
(9) అంధకుడు – (8) 1 భజమానుడు – (7) విడూరథుడు
– (6) శిని – (5) భోజుడు – (4) హృదికుడు
(3) 1 దేవమీఢుడు (శూరుడు) ~ మారిష
(2) వసుదేవుడు ~ దేవకి - (1) కృష్ణుడు
శ్రీకృష్ణుని మాతృ వంశం
(9) అంధకుడు – 2 కకురుడు – వృష్ణి – విలోమ తనయుడు –
కపోతరోముడు – అనువు (తుంబురుడు సఖుడు) – దుందుభి - దవిద్యోతుడు – ఆపునర్వసువు –
ఆహుకుడు – 1 దేవకుడు,
(2)
వసుదేవుడు ~ దేవకి - (1) కృష్ణుడు
No comments:
Post a Comment