Wednesday, September 17, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – అరయగ

5.2-51-.
యఁగ సీతాలక్ష్మణ
రివృతుఁడై వచ్చి రామద్రుఁడు గడిమిం
రఁగు నధిదేవతగఁ గిం
పురు మహావర్షమునకు భూపవరేణ్యా!
          ఓ పరీక్షిన్మహారాజా! కింపురుష వర్షానికి సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అధిదేవత.
సప్తద్వీపములలో ప్రథమమైనది జంబూద్వీపం. జంబూద్వీపంలో ఉన్న నవవర్షములు (9) లోను ఆరవది (కింపురుష వర్షం) అధిపతి ఆంజనేయుడు, అధిదేవత శ్రీరాముడు. ఏడవది భరత వర్షం అధిపతి నాభి అధిదేవత నారాయణుడు. http://telugubhagavatam.org/?Details&Branch=anuyuktaalu&Fruit=7_Islands[>;వివరణలు > అనుయుక్తములు  > సప్త ద్వీపాలు వివరాలు]
5.2-51-ka.
araya@Mga seetaalakshmaNa
parivRtu@MDai vachchi raamabhadru@MDu gaDimiM
bara@Mgu nadhidaevataga@M giM
purusha mahaavarshamunaku bhoopavaraeNyaa!
          అరయగన్ = చూడగా; సీతా = సీతయు; లక్ష్మణ = లక్ష్మణుడు; పరివృతుండు = చుట్టునున్నవాడు; = అయ్యి; వచ్చి = చేరి; రామభద్రుడు = శ్రీరాముడు; కడిమిన్ = అతిశయముతో; పరగున్ = ప్రసిద్ధమగు; అధిదేవతగన్ = అధిదేవతగ; కింపురుష = కింపురుషము యనెడి; మహా = గొప్ప; వర్షమున్ = వర్షమున; కున్ = కు; = భుపవరేణ్య = మహారాజా {భూపవరేణ్యుడు - భూప (రాజు)లలో వరేణ్యుడు (ముఖ్యుడు), మహారాజు};

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: