సరసిం బాసిన
1-64-మ.
సరసిం
బాసిన వేయు కాలువల యోజన్
విష్ణునం దైన శ్రీ
కర నానా ప్రకటావతారము
లసంఖ్యాతంబు లుర్వీశులున్
సురలున్ బ్రాహ్మణ
సంయమీంద్రులు మహర్షుల్
విష్ణు నంశాంశజుల్
హరి
కృష్ణుండు బలానుజన్ముఁ డెడ లే; దా విష్ణుఁడౌ నేర్పడన్.
1-64-ma.
sarasiM
baasina vaeyu kaaluvala yOjan^ vishNunaM daina Sree
kara naanaa
prakaTaavataaramu lasaMkhyaataMbu lurveeSulun^
suralun^
braahmaNasaMyameeMdrulumaharshul^ vishNunaMSaaMSajul^
hari
kRshNuMDu balaanujanmu@M DeDa lae; daa vishNu@MDau naerpaDan^.
భాగవత పురాణం ప్రారంభిస్తు సూతుడు శౌనకాదులకు శ్రీహరి అవతారాల
గురించి చెప్తూ ఇలా అన్నాడు. – సరస్సుల నుండి ఎన్నో కాలవలు వెలువడి ప్రవహిస్తూ
ఉంటాయి. అలాగే శ్రీమన్నారాయణుని లోనుంచి విశ్వశ్రేయో దాయకములైన ఎన్నెన్నో అవతారాలు
ఆవిర్భవిస్తూ ఉంటాయి. రాజ్యాలేలేవాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు,
మహర్షులు, ఆ నారాయణుని సూక్ష్మ అంశలచే ఉద్భవించిన వారే. పూర్వం బలరామునిగా అతని సోదరుడు
శ్రీకృష్ణునిగా శ్రీమహావిష్ణువు తానే అవతరించాడు కదా.
1-64-మ.| సరసిన్ = సరస్సు నుండి; పాసిన = వెలువడిన; వేయు = అనేకము లైన / వెయ్యి; కాలువల = కాలువల; యోజన్ = వలె; విష్ణుని = హరి; అందైన = నుండి ఉద్భవించిన; శ్రీకర = శుభములు కలిగించు; నానా = అనేక విధముల; ప్రకట = అభివ్యక్త మైన; అవతారములు = పుట్టుటలు; అసంఖ్యాతంబులు = లెక్కకు మిక్కిలినవి; ఉర్వీశులు = రాజులు {భూమి పతులు, రాజులు}; సురలున్ = దేవతలు; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; సంయమ = జితేంద్రియులలో; ఇంద్రులు = శ్రేష్టులు; మహా = గొప్ప; ఋషుల్ = ఋషులు; విష్ణుని = హరియొక్క; అంశాంశ = సూక్ష్మఅంశలతో; అజులు = పుట్టిన వారు; హరి = హరి; కృష్ణుండు = కృష్ణుడు; బల = బలరామునికి; అనుజన్ముఁడు = తోబుట్టువు వలె; ఎడల లేదా = వచ్చాడు కదా; విష్ణుఁ డౌ = హరి యై; ఏర్పడన్ = ఉండగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
2 comments:
Briliance
మళ్ళా ధన్యవాదాలు రవిగారు.
అవునండి. నింజంగానే ఆయన బ్రిలియంట్ మోస్టు. సహజ కవి. మహా పండితుడు. పండిత పామరుల నందరిని, తెలుగు నచ్చేవాళ్ళు, సంస్కృతం నచ్చేవాళ్ళు, రెండూ కావాలనే వాళ్ళు అందరిని మెప్పింస్తాడు. అందుకే నా కైతే చాలా ఇష్టం పోతన గారు అంటే.
మీలాంటి సహృదయుల స్నేహం దొరకటం నా అదృష్టం.
Post a Comment